Breaking News

ఆరోగ్య కార్యక్రమాలపై పరిశీలన మరియు పర్యటన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం వైద్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం తరఫు నుండి పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ మోనిటరింగ్ ఆఫీసర్స్ జిల్లా పర్యటన లో అమలవుతున్న కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య కార్యక్రమాలపై పరిశీలన మరియు పర్యటన నిమిత్తము పర్యటించారు. బుధవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయములో వైద్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ , భారత ప్రభుత్యం తరపున పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ నుండి మానిటరింగ్ ఆఫీసర్స్ డా రాజేష్, జే . నాయర్, డాక్టర్ ఎం సి మాథ్యూస్ జిల్లాలో పర్యటన నిమిత్తం ప్రోగ్రాం ఆఫీసర్స్ అందరితో సమావేశము ఏర్పరచి జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాల పనితీరును అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అందించే జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను అన్నిటిని పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ బృందానికి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా లెప్రిసి మరియు క్షయ ఆఫీసర్ డాక్టర్ ఎన్ వసుంధర , పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ టీం వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలను తెలియచేశారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ ద్వారా అమలు తీరును, వైద్యసేవలు మరియు ఫ్యామిలీ ఫిజిషన్ కాన్సెప్ట్ ద్వారా రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన సచివాలయంలో ఉన్న వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ నందు అందించే ఆరోగ్య సేవలు తెలియపరిచారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత దిశా నిర్దేశం లో ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యం తో నూతనంగా ఏర్పాటు చేసిన బంగారుకొండ కార్యక్రమంలో భాగంగా పౌష్టికాహార లోపం , బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి బాలమిత్రాల ద్వారా వారం వారం వారి ఎత్తు బరువులను పరిశీలించి తగిన వైద్య సదుపాయాలు పోషణ అందించే ప్రయత్నం చేస్తున్నారని దీని ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎమ్ హెచ్ ఓ డాక్టర్ వరలక్ష్మి మాట్లాడుతూ ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ లో జరుగుచున్న ఆరోగ్య సేవలను మరియు ఇంటి వద్ద ఉన్న బెడ్ రిడెన్ కేసులకు ఆందించే సేవలను గురించి టీంకు వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డా . రాజ కుమారి మాట్లాడుతూ ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కార్యక్రమాల ద్వారా అమలవుతున్న సేవలను తెలియజేశారు.

డాక్టర్ రాజీవ్ మాట్లాడుతూ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా అమలయ్యే డైరెక్ట్లీ ఎర్లీ ఇన్ ట్రవెన్సన్ సెంటర్ (DEIC) వివరాలు తెలియజేశారు. డాక్టర్ అభిషేక్ మాట్లాడుతూ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, ఆశ ,ఏఎన్ఎం పనితీరును సచివాలయంలో జరుగుతున్న వైద్య సేవలను వివరించారు.

ఈ సందర్భంగా జనాభా రీసెర్చ్ సెంటర్ నోడల్ ఆఫీసర్స్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు లబ్ధిదారులకు అందే ప్రక్రియలో ఎక్కడైనా లోపాలు ఉన్నవా అనే అంశాలపై పరిశీలించి మూడు రోజులు జిల్లాలో ఉన్న ఏరియా హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు , పాఠశాలలు, మరియు అంగన్వాడీ సెంటర్లు దర్శించి వైద్య సేవలు ప్రజలకు అందచేస్తున్న వైద్య సేవలు పై నివేదిక కేంద్ర ప్రభుత్వం వారికి సమర్పిస్తారని తెలియజేశారు. ఆమేరకు జిల్లా ఆరోగ్య ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీదేవి , డాక్టర్ రవికుమార్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *