గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త :
పదవ తరగతి లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు రెగ్యులర్ విద్యార్థులతో పాటు చదువుకునే అవకాశం నిజంగా ఒక గొప్ప వరం అని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత
పేర్కొన్నారు.
బుధవారం గోపాలపురం జెడ్పీ హై స్కూల్ ను జిల్లా కలెక్టర్ సందర్శించి, రీ జాయినింగ్ విద్యార్థులకు ఎమ్మెల్యే తో కలిసి ధ్రువ పత్రాలను అంద చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యార్థుల చదువుల కోసం ఎన్నో పథకాలను అమలు చేయడం జరుగుతోందని , ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. స్కూల్ లో మధ్యాహ్న భోజన పథకం కింద అమలు చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు ముగ్గురు పిల్లలు ఇంటి వద్ద నుంచే భోజనం తీసుకుని రావడం పై వివరాలు తెలుసుకుని, ఇక్కడ ప్రతి రోజూ ఒకొక్క రకంగా పోష్టికాహరం అందచేస్తారని, ప్రతి రోజూ కోడి గుడ్డు ఇస్తారని పేర్కొన్నారు.
ప్రవేటు స్కూల్ లో చదువుతున్న ముగ్గురు పిల్లలు కొత్తగా ఈ స్కూల్ లో జాయిన్ అవ్వగా వారికి అడ్మిషన్ పత్రాలు కలెక్టర్ అందజేశారు. 10 వ తరగతి లో ఉత్తీర్ణత సాధించని ముగ్గురు విద్యార్థులు స్కూల్ లో రీ జాయిన్ అవ్వడం పట్ల కలెక్టర్ అభినందించారు. మీలో ప్రతిభ ఉంది సిఎం మళ్ళీ స్కూల్ లో రెగ్యులర్ విద్యార్థులతో పాటు చదువుకునే అవకాశం కల్పించారు. కష్ట పడితే తప్పక మీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారని కలెక్టర్ తెలిపారు
జగనన్న కలుగ చేస్తున్న పథకాలు పూర్తి స్థాయి లో సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సూచించారు. అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన వంటి పథకాలు ద్వారా ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
బంగారు కొండ కిట్స్ పంపిణీ:
జెడ్పీ హై స్కూల్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో భాగంగా పౌష్టికాహరం లోపం కారణంగా రక్త హీనత, వయస్సు కు తగ్గ ఎత్తు, బరువు సరైన ఎదుగుదల లేని ముగ్గురు పిల్లలను బంగారు కొండ కార్యక్రమం ద్వారా దత్తత తీసుకొవడం జరిగిందని కలెక్టర్ మాధవీలత తెలిపారు. మండల ప్రత్యేక అధికారి సత్య గోవింద్, ఎంపిడివో, సిడిపివో లు కాండ్రు కోటబాబు, పలివెల బాబు(అర్జున్), ఆకుమర్తి అద్విక్ లను దత్తత తీసుకొగా, కలెక్టర్ బంగారు కొండ కిట్స్ అందచేశారు . ఈ సందర్భంగా ఆయా అధికారులను కలెక్టర్ అభినందించారు.
కలెక్టర్ వెంట డి ఈ వో ఎస్ అబ్రహం, ఆర్డీవో ఎస్. మల్లి బా, స్పెషల్ ఆఫీసర్ డా ఎస్ జీ టి సత్య గోవింద్,జెడ్పీటీసీ కె. లలిత, ఎంపిపి ఉండవల్లి సత్యనారాయణ, సర్పంచ్ పైడి శిరీష, అతిరాస కార్పొరేషన్ చైర్మన్ ఇళ్ళ భాస్కర్ రావు, ఏ ఎం సి చైర్మన్ జీ. జనార్ధన్, తహశీల్దార్ రవీంద్ర, ఎంపిడివో ఆర్. శ్రీదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ సోమరాజు, ఇతర అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు , వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.