-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ఆ మేరకు నిధులను విడుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె మాధవి లత పేర్కొన్నారు
బుధవారం ఉదయం కలెక్టర్ నుండి క్యాంపు కార్యాలయం నుండి పాఠశాలలో నాడు నేడు పనులు, ప్రాధాన్యత భవనాలు పై మండల స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో 654 పాఠశాలలో రూ.49.52 కోట్ల తో చేపడుతున్న నాడు నేడు పనులను అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పూర్తి చేయాలన్నారు. అదనపు తరగతి గదులు, మరుగు దొడ్లు, విద్యుత్, త్రాగునీటి సరఫరా, గ్రౌండ్ ఫ్లోర్, తదితర పెందింగ్ పనుల ను త్వరిత గతిన చేపట్టాలని పేర్కొన్నారు. ఆయా నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ ను కూడా సిద్ధం చేసుకుని, మండల విద్యా అధికారులు వ్యక్తిగత పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టాలని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 2293 పనులకు సంబంధించి రూ.20.31 కోట్ల మేర పనులు పూర్తి కాగా ఇప్పటి వరకు 2268 పనులకు చెందిన రూ.17.62 కోట్ల వివరాలు అప్లోడ్ చేశారని, మిగిలిన వాటి వివరాలు వెంటనే అప్లోడ్ చెయ్యాలని ఆదేశించారు.
ప్రాధాన్యత భవనాలు కింద అర్భికే, సచివాలయ, హెల్త్ క్లినిక్ భవనాలు స్టేజ్ కన్వర్షన్ కు అనుగుణంగా పనులు పూర్తి చెయ్యడం తో పాటు, ఎప్పటికప్పుడు ఆయా బిల్లులు అప్లోడ్ చెయ్యాలని పిఆర్ ఇంజనీరింగ్ అధికారులు మాధవీలత ఆదేశించారు.
ఈ టెలి కాన్ఫరెన్స్ లో డిఈఓ ఎస్. అబ్రహం, ఎస్ ఈ పిఆర్ ఎ బి వి ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ డి. బాల శంకర రావు లు పాల్గొన్నారు.