-లబ్దిదారులను సురక్షితంగా తీసుకుని వెళ్లి తీసుకుని రావాలని ఆదేశాలు
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీఆర్డీఏ పరిధిలోని వెంకటపాలెం, కృష్ణాయపాలెంలో పేద ప్రజలు స్థిర నివాసాలను ఏర్పాటు చేసకోవాలనే బృహత్తర ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం క్రింద నేడు ముఖ్యమంత్రివర్యుల చేత గృహ నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమనికి బయలు దేరే లబ్దిదారుల వాహనాలను సోమవారం కమీషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేసినారు. విజయవాడ నగరంలోని బి.ఆర్.టి.ఎస్ రోడ్, కుమ్మరిపాలెం సెంటర్ షాదిఖానా, భవానిపురం బాబ్బురి గ్రౌండ్, కృష్ణలంక సర్వీసు రోడ్డు నందు ఏర్పాటు చేసిన బస్సులను పరిశీలించి లబ్దిదారులను సురక్షితంగా తీసుకుని వెళ్లి తీసుకుని రావాలని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, త్రాగునీరు, భోజన వసతులను ఏర్పాటు చేయాలనీ సంభందిత అధికారులను ఆదేశించారు.