Breaking News

ముందస్తు కార్యాచరణ ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో ఖరీఫ్ 23 సాగు ప్రణాళిక, కొనుగోలు ప్రక్రియ నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల మార్గదర్శకాలకు అనుగుణంగా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ స్పష్టం చేశారు.

గురువారం ఉదయం పౌర సరఫరాల విసి & ఎండి జీ. వీర్య పాండ్యన్, కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ లు ఖరీఫ్ 2023 లో విత్తనాలు మరియు పంటకోత ప్రతిపాదనలుపై జాయింట్ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక జేసీ ఛాంబర్ నుంచి జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జేసీ ఎన్. తేజ్ భరత్ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో విత్తనం నాటిన దశ నుంచి సి ఎం ఆర్ ద్వారా ధాన్యం సేకరణ చేసే విధానం లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిర్దేశించిన మార్గదర్శకాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ క్రమంలో గత మూడు సీజన్ లలో పంట దిగుబడి ఆధారంగా ఈ సీజన్ లో ధాన్యం సేకరణ కు లక్ష్యాలను నిర్దేశించాలని సూచించారు. గత ఖరీఫ్, రబీ సీజన్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి మిల్లర్ల తో సమన్వయం సాధించడం జరిగిందని అన్నారు. ముందస్తుగానే ఆయా మిల్లర్ల మిల్లింగ్ సామర్థ్యం అనుగుణంగా సేకరణ లక్ష్యాలను నిర్దేశించడం, వారు ద్వారా సరఫరా చేసే గన్ని బ్యాగుల వివరాలకు అనుగుణంగా ఆన్లైన్ ప్రక్రియ ప్రవేశ పెట్టడం ద్వారా మరింత ఆహ్వానించతగిన ప్రతిపాదన అని తేజ్ భరత్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ విసి అండ్ ఎండి జీ. వీర పాండ్యన్, కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ లు మాట్లాడుతూ, రాష్ట్రంలో ధాన్యం సేకరణ కోసం ఆర్భికే ల ద్వారా కొనుగోళ్లు చేపట్టే దిశలో ఆయా కేంద్రాలలో తేమ శాతం కొలిచే పరికరం, టార్ఫలిన్ లు, హుక్ రీమువర్స్, స్కూప్స్ , పోకర్స్, డిజిటల్ పాకెట్ స్కేల్స్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. అర్భికే లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు పట్ల కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసే విధానం లో ఇక్కడ అమలు జరుగుతున్న పారదర్శకత పట్ల సానుకూల స్పందన రావడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

అనంతరం జేసీ ఎన్. తేజ్ భరత్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిర్దేశించి 29 అంశాల అజెండా కు అనుగుణంగా జిల్లా స్థాయి లో కార్య ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సి ఎం ఆర్ మిల్లర్ల ను ఆయా కేటగిరీల వారీగా గుర్తించడం జరిగిందని, అందుకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేపట్టాలని కోరారు. ఈ ఏడాది ఆలస్యంగా వర్షాలు కురవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నాట్లు వేశారన్నారు. ఆమేరకు కోతలు , కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ, మిల్లర్ల మ్యాపింగ్, గన్ని బ్యాగుల ముందస్తు సేకరణ తదితర ప్రతి ఒక్క అంశం కార్య ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి పి. విజయ భాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు, డి ఏం మార్కెటింగ్ ఎ. కుమార్, ఏ ది మార్కెటింగ్ ఎమ్. సునీల్ వినయ్, జిల్లా కో ఆపరేటివ్ అధికారి వై. ఉమా మహేశ్వర రావు, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *