-ఆగస్ట్ 7 వ తేదీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇంటర్వూలు
-ఉదయం 9 నుంచి సా.4 వరకు సంబంధిత ధృవీకరణ పత్రాలతో హాజరు కావాలి
-ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా బి. సౌభాగ్య లక్ష్మి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లో సీనియర్ రెసిడెంట్ వాక్-ఇన్ ఇంటర్వూ లను నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా బి. సౌభాగ్య లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, విజయవాడ వారి నోటిఫికేషన్ ప్రకారం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రాజమహేంద్రవరం నందు “సీనియర్ రెసిడెంట్ “ నియామకానికి 07-08-2023 వ తేదీ సోమవారం ఉదయం 09 గంటలు నుండి సాయంత్రం 04 గంటల వరకు అభ్యర్థులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరుపబడునని తెలిపారు.
భర్తీ చేయనున్న పోస్ట్‌లు వివరాలు :
జనరల్ మెడిసిన్ , జనరల్ సర్జరీ , ప్రసూతి శాస్త్రం గైనకాలజీ , పీడియాట్రిక్స్ , అనస్థీషియా, ఆఫ్త్మాలజి , ఈ ఎన్ టి, డివిఎల్ (Dermatology/STD), పల్మోనాలజీ (TB&CD), Psychiatry, రేడియో రోగ నిర్ధారణ / రేడియాలజీ, అత్యవసర వైద్యం, డెంటిస్ట్రీ / డెంటల్ సర్జరీ, అనాటమీ, ఫీజీయోలజీ, బయో-కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాల్లో
అభ్యర్దులు తీసుకుని రావలసిన సర్టిఫికెట్స్ :
ఎస్.ఎస్.సి సర్టిఫికెట్ , ఎమ్.బి.బీ.ఎస్. , పీజీ, డిగ్రీ సర్టిఫికెట్స్ , మెడికల్ కౌన్సి ల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ , పీజీ మార్కుల జాబితా , సోషల్ స్టేటస్ సర్టిఫికెట్ , ఆధార్ కార్డు , 4 వ తరగతి నుంచి 10 వ తరగతి స్టడీ సర్టిఫికెట్స్ లతో హాజరు కావాలని తెలియ చేశారు.