రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
భారత ఎన్నికల సంఘం సీనియర్ ఎన్నికల అధికారులు విశాఖపట్నంలో ఎస్ఎస్ఆర్ – 2024 పై రెండు రోజుల సమావేశం నిర్వహించడం జరిగిందని స్వచ్ఛమైన, సమగ్రమైన, ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితాను నిర్ధారించడానికి దిశా నిర్దేశనం చేసినట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత విశాఖపట్టణం నుంచి ఒక ప్రకటనలో తెలిపారు.
ఓటరు గుర్తింపు ఇంటింటికి వెళ్లి ధృవీకరణ, యువ ఓటరు గుర్తింపు, బలహీన గిరిజన సమూహం (PVTG) లు ఇతర అట్టడుగు వర్గాలకు చెందిన వారిని ఓటర్ల గా నమోదు నిమిత్తం రిజిస్ట్రేషన్ డ్రైవ్ వేగవంతం చేయడానికి భారత ఎన్నికల సంఘం సూచనలు చెయ్యడం జరిగిందని కలెక్టర్ తెలియ చేశారు. ఎస్ ఎస్ ఆర్ 2024 కార్యకలాపాలు, ప్రక్రియ పూర్తయ్యే సమయానికి స్వచ్ఛమైన, కలుపుకొని, తప్పులు లేని ఓటర్ల జాబితాను నిర్ధారించ డానికి ప్రారంభించిన వివిధ దశల పై చర్చించడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ యొక్క ఈ కీలక దశలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు విధి విధానాలను అనుసరించడం వంటి వాటాదారుల భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను భారత ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం నొక్కి చెప్పడం జరిగిందన్నారు. భారత ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారులకు కూడా యువ ఓటర్లు, విడిచి పెట్టిన ఓటర్లు ఉంటే వారి నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించినట్లు పేర్కొన్నారు. మానవ వనరుల లభ్యత, శిక్షణ, ఈవిఎం ల లభ్యత, చట్టబద్ధమైన ప్రక్రియ, డాక్యుమెంటేషన్, పోలింగ్ స్టేషన్ హేతుబద్ధీకరణ, హామీ ఇవ్వబడిన కనీస సౌకర్యాలు, ఫిర్యాదు నిర్వహణ, ఇతర అంశాలపై కూడా ఈ రెండు రోజుల పాటు నిర్వహించిన సమావేశంలో చర్చించినట్లు కలెక్టర్ మాధవీలత తెలియ చేశారు.
ఈ సి ఐ ప్రతినిధి బృందంలో సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ హిర్దేష్ కుమార్, సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ ఎన్ బుటోలియా, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, సంజయ్ కుమార్, అండర్ సెక్రటరీ, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా, 26 జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.