-జగనన్న సురక్ష కింద వొచ్చిన దరఖాస్తుల్లో 99.77 శాతం పరిష్కరించాం
-జగనన్నే మా నమ్మకం – మా భరోసా అంటూ ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు
– హోం మంత్రి తానేటి వనిత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజా సమస్యల పరిష్కారం కోసం, నియోజక వర్గ సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జవాబుదారీతనం తో కూడిన సంక్షేమ పాలన అందించడం జరుగుతోందని రాష్ట్ర హోం మంత్రి డా తానేటి వనిత పేర్కొన్నారు.
జగనన్న సురక్ష పై స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, జిల్లాలో సంక్షేమ పథకాల అమలు చేయడం ద్వారా 99 శాతం మంది అర్హులకు సంక్షేమ పథకాల ప్రయోజనం కలుగ చెయ్యడం జరిగిందని అన్నారు. మిగిలిన ఒక్క శాతం మందికి కూడా వారి అర్హత మేరకు వర్తింప చేసేందుకు జగనన్న సురక్ష కింద జూలై నెలలో జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టి దరఖాస్తులు తీసుకోవడం జరిగిందన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా జిల్లాలో సర్వే నిర్వహించిన గుర్తించిన సేవలలో 5,77, 753 మందికి (99.77%,) సంతృప్తి స్థాయి లో అందించడం జరిగిందని ఇచ్చారు. ఇంకా వివిధ కారణాల వల్ల అందుబాటులో లేకుండా మిగిలిన 15421 మంది ఉన్నా రన్నారు. వారిని కూడా గుర్తించి అర్హత మేరకు ప్రయోజనం కోసం చర్యలకు జిల్లా యంత్రాంగం అడుగులు వెయ్యడం జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు.
వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. అర్హత ఉన్నా ఇంకా ఎక్కడైనా ఉన్నారా అనే విధానంలో జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టామన్నారు. జల్లెడ సర్వే చేపట్టి అర్హత కలిగిన గుర్తించి టోకెన్లు జారీ చేసినట్లు తెలిపారు. గ్రామ సభలు నిర్వహించి వారి సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేశారన్నారు. ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు చేపట్టిన దాఖలాలు లేవని, మన ముఖ్యమంత్రి ప్రజల అవసరాలు గుర్తించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ద్వారా వాటిని పరిష్కారం చేయడం వల్ల జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతం కావడం జరిగిందని హోం మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 175 నియోజక వర్గ స్థాయి లో సమావేశాలు నిర్వహించి మండలాలు, గ్రామాల వారీగా అక్కడి సమస్యలు తెలుసుకునేందుకు స్థానిక శాసన సభ్యులు, జిల్లా ఇంఛార్జి మంత్రి, జిల్లా కలెక్టర్, అధికారులతో సమావేశం నిర్వహించడం జరుగుతోందని హోం మంత్రి తానేటి వనిత తెలియ చేశారు. ఆ సమీక్ష లో గుర్తించిన సమస్యలు మండల, జిల్లా స్థాయిలో పరిష్కారం చెయ్యడం జరుగుతుందని, ఒకవేళ రాష్ట్ర స్థాయి లో పరిష్కారం చెయ్యవలసి ఉంటే జిల్లా ఇంఛార్జి మంత్రి ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు.
ప్రజల వద్దకే పరిపాలన తీసుకుని వెళ్ళే క్రమంలో సచివాలయ వ్యవస్థ, అర్భికే, హెల్త్ సెంటర్లు తీసుకుని రావడం జరిగిందన్నారు. మానవ వనరులను ఏర్పాటు చెయ్యడం ద్వారా జగనన్న మా నమ్మకం, మా భవిష్యత్తు అనే నినాదం ప్రజల నుంచి రావడం చూస్తున్నాం అన్నారు. ప్రజల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ఉన్న అభిమానానికి ఇటువంటి సంఘటనలు నిదర్శనమన్నారు. ప్రజల్లోకి వెళితే ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకం చూడగలుగుతారని పేర్కొన్నారు. మంత్రి వెంట ఈ సమావేశంలో మునిసిపల్ చైర్ పర్సన్ బావన రత్న కుమారి, జెడ్పీ వైస్ చైర్మన్ పోసిన శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.