Breaking News

నివేదిక పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని నివేదిక అందచెయ్యలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణ కిరణ్ రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించి అందచేసిన నివేదిక పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని నివేదిక అందచెయ్యలని జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ ఆదేశించారు.

శుక్రవారం జేసీ ఛాంబర్ లో ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణ కిరణ్ జాయింట్ కలెక్టర్, ఇతర సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి తేజ్ భరత్ మాట్లాడుతూ, జిల్లాలో ఆహార భద్రత అమలు జరుగుతున్న తీరును క్షేత్ర స్థాయి లో పరిశీలన చెయ్యడానికి రెండు రోజులు పాటు పర్యటించి, నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. సి సి కెమెరాల ఏర్పాటు , మొబైల్ డెలివరీ యూనిట్స్ వాహనాలు ద్వారా జరుగుతున్న నిత్యావసర సరుకుల పంపిణీ, రెండు అంగన్వాడి కేంద్రాల నిర్వహణ తీరు పై గుర్తించిన లోపాలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందచెయ్యడం జరిగిందని అన్నారు. ఆమేరకు ఆయా లోపాలను సవరించి సంపూర్ణ నివేదిక అందచెయ్యలని జక్కంపూడి కిరణ్ జేసీ ని కోరడం జరిగింది. ఫుడ్ కమిషన్ వారు పేర్కొన్న ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకునే భవిష్యత్తులో మరింత పకడ్బందీగా అమలు చేయడం మనందరి బాధ్యతగా జేసీ తేజ్ భరత్ తెలిపారు.

ఈ సందర్భంగా జె కృష్ణ కిరణ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రత విషయంలో అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటూ పౌష్టిక విలువలు కలిగిన బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను అందించడం జరుగుతోందన్నారు. ఆ క్రమంలో వాటిని జవాబుదారీ తనం కలిగి సేవలు అందించాల్సి ఉంటుందన్నారు.

ఈ సమావేశంలో డి ఎస్ వో పి. భాస్కర్ రావు, డి ఏం మార్కెటింగ్ ఎ. కుమార్, ఐ సి డిఎస్ పిడి కె. విజయ కుమారి, డిఎస్డబ్ల్యూఓ ఏం. సందీప్, డిటిడబ్ల్యూఓ కే ఎన్ జ్యోతి, డిబిడబ్ల్యూఓ పి ఎస్ రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *