Breaking News

బడిబయట పిల్లలు బడిలోనే ఉండే విధంగా చర్యలు..

-ఖాళీగా ఉన్న వార్డు మెంబర్ల పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తాం..
-కలెక్టరు డా. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 10 మండలాలకు చెందిన 19 గ్రామాల పరిధిలో గల ఖాలీగా ఉనన్న వార్డుల ఎన్నికలకు సంబందించి బ్యాలెట్ బాక్సులు సిద్దం చేసామని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత వివరించారు.

గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. జవహర్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు, సమగ్ర అభివృద్ది లక్ష్యాలు, వైద్య ఆరోగ్యం, విద్య, గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ అర్జీలు, గడపగడపకు మన ప్రభుత్వం అంశాలపై విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టరు డా. కే. మాధవీలత జాయింట్ కలెక్టరు తేజ్ భరత్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లు ఆదేశిస్తూ ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్ల పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని, అలాగే పాఠశాల , కళాశాలల బయట ఉన్న విద్యార్థులను తిరిగి పాఠశాల, కళాశాలలో వెంటనే చేర్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు , బ్యాలెట్ పేపర్లు సిద్దం చేసుకోవాలని, ఎన్నికల నియమావళి మేరకు పోలింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని , పోలింగ్ కు ముందుగా మద్యం దుకాణాలు మూసి వేయించడం, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం వంటి నియమాలు కచ్చితంగా పాటిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టరు డా. కే. మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో 10 మండలాలకు చెందిన 19 గ్రామాల పరిధిలో గల వార్డు లకు ఎన్నికలకు సంబందించి బ్యాలెట్ బాక్సులు సిద్దం చేసామని వివరించారు. రక్తహీనత గల కౌమార దశ బాలికలు 100 మంది గుర్తించామని వీరి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. రక్తహీనత గల గర్భిణీలు, 5 సంవత్సరాలు లోపు బలహీనంగా ఉన్న పిల్లలను గుర్తించి వారికి వైద్య సేవలందిస్తున్నామన్నారు. గడపగడపకు మనప్రభుత్వం క్రింద జిల్లాలోని 512 పంచాయీల పరిధిలో 1440 పనులను గుర్తించి ఇప్పటి వరకు 1332 పనులను మంజూరు చేసి 1229 చోట్ల పనులను ప్రారంభించామన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ సేవల నేపధ్యంలో డా. వైఎస్సార్ పెన్షన్ కానుక కు సంబందించి226,ఇళ్ల స్థలాలకు సంబందించి 371 గ్రామీణ ప్రాంతాల్లో 5 పట్టణ ప్రాంతాల్లో, రేషన్ కార్ఢులకు సంబందించి 1492, సమీకృత దృవ పత్రాలకు సంబందించి 2566, ఆధాయ దృవీకరణ పత్రాలకు సంబందించి 2421 సేవలు అర్జీలు వచ్చాయని తెలిపారు. పాఠశాల విద్య పై సమీక్షిస్తూ బడి బయట పిల్లలను నూరు శాతం పాఠశాలలో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 6,9, ఇంటర్ మీడియట్ బడిబయట పిల్లలను గుర్తించామని వారిని బడిలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

వీడియో కాన్పరెన్స్ లో జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *