Breaking News

ఆగస్ట్ 22 నిడదవోలు సిఎం పర్యటన విజయవంతం చేయాలి

-ముఖ్యమంత్రి జిల్లాలో ఎనిమిదవసారి పర్యటిస్తున్నారు.
-అధికారులు సమన్వయంతో సమర్ధవంతంగా పనిచేయాలి.
-క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలన
-జిల్లా కలెక్టర్ కె.మాధవీలత
-సిఎం కార్యక్రమాల సమన్వయకర్త రఘురాం

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 22న , మంగళ వారం నిడదవోలు పట్టణంలో నిర్వహించే “కాపునేస్తం” రాష్ట స్థాయి కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో అధికారులకు వారికి కేటాయించిన విధులు నిబద్దత తో నిర్వహించాలని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత, ఎమ్మెల్సీ , సిఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం లు పేర్కొన్నారు.

శుక్రవారం స్థానిక పురపాలక సంస్థ కార్యాలయ సమావేశమందిరంలో ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లు పై కలెక్టర్ మాధవీలత, ఇంచార్జి ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఎమ్మెల్సీ తలశిల రఘూరాం, జేసీ, మున్సిపల్ కమీషనర్, సహాయ కలెక్టర్, శాసన సభ్యులు జి. శ్రీనివాసనాయుడు, తలారి వెంకట్రావు లతో కలిసి సమీక్షించారు.

ఈ సందర్బగా జిల్లా కలెక్టరు డా. కే . మాధవీలత మాట్లాడుతూ ఈనెల 22 వ తేదీ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నిడదవోలు పట్టణంలో నిర్వహించనున్న “కాపు నేస్తం” రాష్ట్ర స్థాయి వేడుకల్లో పాల్గొంటారన్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏడు సార్లు జిల్లాలో సీఎం పర్యటన ను అందరం సమన్వయం చేసుకోవడం ద్వారా విజయవంతం చెయ్యడం జరిగిందన్నారు. సీయం పర్యటనకు సంబందించి వివిధ అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తమకు కేటాయించిన విధులను బాధ్యతా యుతంగా నిర్వహించాలన్నారు. ఎటువంటి సంఘటనలు జరిగేందుకు తావులేకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో శాఖల మధ్య సమన్వయం చేసుకొవాలని అన్నారు.

ముఖ్యమంత్రి పర్యటన రోడ్ షో లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు , వర్షం కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని మాధవీలత అన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు, విద్యార్థులకు, ప్రతి ఒక్కరికీ తగిన విధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. సమయం తక్కువుగా ఉన్నందున అధికారులు వారికి కేటాయించిన విధులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అధికారులకు ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటనకు సంబందించి గత అనుభవం ఉందని ఆమేరకు కార్యాచరణ ప్రణాళిక మేరకు విజయవంతం చేయాలన్నారు.

ఈ పర్యటనలో హెలీప్యాడ్ నుండి సభా వేధిక వరకు రోడ్ షో లోను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభా వేదిక వద్ద గ్యాలరీల నందు ప్రజలు, లబ్దిదారులకు, విద్యార్థులకు వాటర్ ప్యాకెట్స్, అల్పాహారం, తగిన మెడికల్ క్యాంపులు సిద్దం చెయ్యాలని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు సిద్దం చేయాలన్నారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున యువత హాజరవుతారని అందుకు తగిన జాగ్రత్తలు అవసరం అన్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడాలని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త తలశిల  రఘూరాం మాట్లాడుతూ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పర్యటన కు సంబంధించి జిల్లాలో అధికారులకు అనుభవం ఉందని ఆ దిశలో అధికారులకు కేటాయించిన విధులను చేపట్టి సిఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

జిల్లా ఇంచార్జి ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి బందోబస్తూ, బారికేడింగ్, రూట్ ఆపరేషన్, వాహనాల పార్కింగ్, సభా వేదిక వద్ద భద్రత వంటి ఏర్పాట్లు చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ మోబలైజేషన్ పై, మున్సిపల్ కమీషనర్ కే. దినేష్ కుమార్ హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకు రూట్ రోడ్ షో పై సమీక్ష నిర్వహించారు. గ్యాలరీ ఇంచార్జిగా సహాయ కలెక్టర్ సి. యస్వంత్ కుమార్ వ్యవహరించి సమన్వయం చెయ్యాలని కోరారు. శాసన సభ్యులు జి. శ్రీనివాస నాయుడు, తలారి వెంకట్రావు లు కార్యక్రమం యొక్క ఏర్పాట్ల పై వివరాలు తెలియచేశారు. తొలుత నిడదవోలు చేరుకున్న కలెక్టర్ హెలిపాడ్, ఇతర కార్యక్రమాలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీఓ లు ఎస్. మల్లిబాబు, ఎ. చైత్రవర్షిణి, బి సి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ వి ఎస్ ఎస్ సుబ్బలక్ష్మి, సిపివో ఏ. ముఖ లింగం, ఎస్ ఈ పిఆర్ ఏ బి వి ప్రసాద్, ఎస్ ఈ ఆర్ అండ్ బి ఎస్ బి వి రెడ్డి, డి ఎస్ వో పి. విజయ భాస్కర్, డి ఎం మార్కెటింగ్ ఏ.కుమార్, మార్కెటింగ్ ఏ డీ ఏం.సునీల్ వినయ్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి, కే ఎస్ జ్యోతి, బీసీ వెల్పేర్ అధికారి, ఎస్. రమేష్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎమ్. సందీప్, పీడీ డ్వామా పి. జగదాంబ, డా సత్య గోవింద్, ఇతర జిల్లా అధికారులు, తదితరులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *