రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు లేబర్ డిపార్ట్మెంట్ వారి సమన్వయంతో స్థానిక ఆటోనగర్ లో గల ది రాజమండ్రి పట్టణ మోటార్ మెకానిక్స్ వెల్ ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్ నందు దుకాణాలలో పనిచేయుచున్న కార్మికుల చట్టాల కోసం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి ఆధ్వర్యంలో కార్మిక హక్కులు, వివిధ కార్మిక చట్టాల గురించి వివరించారు. కార్మికులు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పని చేయాలని సూచించారు. రాజ్యాంగంలో పొందుపరచిన ఉచిత మరియు నిర్భంద విద్యహక్కు చట్టం 2009 ప్రకారం 6 నుండి 14 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు ఉచిత నిర్భంద విద్య పొందడం వారి హక్కు అని పేర్కొన్నారు. . ఈ వయస్సులో ఉన్న పిల్లలను కార్మికులుగా మార్చడం చట్ట రీత్యా నేరం, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలియజేశారు. కార్మికులందరు తప్పనిసరిగా ఈ-శ్రమ్ పోర్టల్ లో వారి వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా ఫించను, ప్రమాద భీమా తదితర ప్రయోజనాలు పొందవచ్చని తెలిజేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విధులను, ఉచిత న్యాయ సేవలను గురించి ప్రత్యూష కుమారి తెలియజేశారు. ఎలాంటి న్యాయ సమస్యలు ఉన్నా, అర్హత కలిగిన వారికి సంక్షేమ పథకాలు అందకపోయినా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి వారి సమస్యలకు పరిష్కరించుకోవచ్చని ఆమె తెలిపారు. న్యాయ సందేహాలకు ఉచిత న్యాయ సలహాలు కూడా పొందవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లేబర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఎ. విజయ ప్రకాష్, ఎ. ఎల్.ఒ. ఎం. లలిత కుమారి, ఇతర ఎ. ఎల్.ఒ లు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు
తదుపరి స్థానిక గౌతమి జీవ కారుణ్య సంఘం వృద్దుల ఆశ్రమంను సందర్శించి అక్కడ వసతులు పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి పోషకాలతో కూడిన ఆహారం అందడం లేదని, తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకుని ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని సంబందిత అధికారులకి సూచించారు.