Breaking News

రాకెట్ నమూనాల ప్రదర్శనకు పోటెత్తిన విద్యార్థులు.. 8తో ముగియనున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు

-ప్రపంచంలోనే ఇస్రో నెంబర్ వన్ అవుతుంది .. విద్యా సంస్థల ప్రముఖులకు ఇస్రో బృందం సత్కారం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రపంచంలోనే నెంబర్ వన్ అవుతుందని ఇందుకు చంద్రయాన్ ప్రయోగం విజవంతమే నిదర్శనమని తిరుమల విద్యాసంస్థల అధినేత నున్న తిరుమలరావు అన్నారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం వివిధ విద్యాసంస్థల ప్రముఖులను  వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో శ్రీహరికోట షార్ ఎల్ఎస్ఎస్ఎఫ్ జనరల్ మేనేజర్, ఉత్సవాల ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఎన్. విజయకుమార్ సారధ్యంలో ఇస్రో శాస్త్రవేత్తల బృందం సత్కరించింది. ఈ సందర్బంగా తిరుమలరావు మాట్లాడుతూ చంద్రయాన్ ప్రయోగ సమయంలో, అది చంద్రునిపై ల్యాండ్ అయిన సమయంలో ఉద్విగ్న క్షణాల మధ్య వీక్షించిన జనం ఆనంద భాష్పాలు రాల్చారని గుర్తుచేశారు. ఒకపక్క రష్యా పంపిన రాకెట్ విఫలమవడం, మరోపక్క ఇస్రో పంపిన చంద్రయాన్ విజయవంతం కావడం మన అదృష్టమన్నారు. చంద్రయాన్ విజయవంతానికి కృషిచేసిన ఇస్రో బృందాన్ని ఆయన అభినందించారు. విద్యార్థులకు స్ఫూర్తిదాయకం .. డా గన్ని భాస్కరరావు మాట్లాడుతూ ఇలా వారోత్సవాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో స్ఫూర్తి కలుగుతుందన్నారు. మనం కల్గించే వాతావరణమే విద్యార్థులకు స్ఫూర్తిగా ఉంటుందని సోదాహరణంగా వివరించారు.మట్టిలో మాణిక్యాల్లా ఇక్కడున్న విద్యార్థులు భవిష్యత్తులో శాస్త్రవేత్తలు అవుతారని ఆయన ఆకాంక్షించారు. అద్భుత స్పందన … శ్రీహరికోట షార్ ఎల్ఎస్ఎస్ఎఫ్ జనరల్ మేనేజర్, ఉత్సవాల ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ విజయకుమార్ మాట్లాడుతూ ప్రజల మధ్య నిర్వహిస్తున్న అంతరిక్ష వారోత్సవాలు అద్భుత స్పందన లభిస్తోందన్నారు. స్పేస్ వాక్ కి 3,500 మంది విద్యార్థులు హాజరుకావడం ఒక రికార్డుగా పేర్కొన్నారు. ఉత్సవాల విజయంతానికి సహకరిస్తున్న స్కూల్స్, కాలేజీల యాజమాన్యాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇస్రో ఆధ్వర్యాన ఈనెల 8వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలలో భాగంగా శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రం ఆవరణలో ఏర్పాటుచేసిన ఇస్రో కార్యకలాపాల వివరాలు, రాకెట్స్ నమూనాల ప్రదర్శనకు సందర్శకులు వివిధ ప్రభుత్వం ప్రయివేట్ పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్, ప్రైవేట్ కాలేజెస్ అసోసియేషన్, ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్, ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన ప్రదర్శనను వివిధ ప్రయివేటు, మున్సిపల్ స్కూల్స్, కాలేజీలకు చెందిన వేలాదిమంది విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, పౌరులు కూడా సందర్శిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి తూర్పు గోదావరి జిల్లా పరిధి నుంచే కాకుండా కాకినాడ తదితర ప్రాంతాల నుంచి వివిధ స్కూల్స్ విద్యార్థులు బస్సులపై వచ్చి ప్రదర్శన తిలకించారు. ఫ్యూచర్ కిడ్స్ తదితర స్కూల్స్ విద్యార్థులు తయారు చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు కూడా ప్రదర్శనలో చోటుచేసుకున్నాయి. అలాగే వివిధ స్కూల్స్ పక్షాన సైన్స్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటైంది. డీఈవో ఎస్ అబ్రహాం, డిప్యూటీ డీఈవో నారాయణ, డిప్యూటీ ఇనస్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ దిలీప్ కుమార్ తదితరులు హాజరయ్యారు. రాజ్యలక్ష్మి మహిళా కళాశాల ఎన్ సిసి కేడెట్స్, వివిధ స్కూల్స్ పీఈటీలు క్యూ పద్దతిలో సందర్శించేలా చూస్తున్నారు. కళాకేంద్రం లోపల చంద్రయాన్ తయారీ, ప్రయోగం విజయవంతం వంటి అంశాలకు సంబంధించి స్క్రీన్ పై ప్రదర్శనలు ఇస్తూ, వాటిపై ప్రశ్నలు అడిగి, సమాధానాలు చెప్పినవారికి ఇస్రో ఆధ్వర్యాన అక్కడికక్కడే బహుమతులు అందించారు. కార్యక్రమానికి రాజమహేంద్రి మహిళా కళాశాల చైర్మన్ టి. కె. విశ్వేశ్వర రెడ్డి, స్వాగతం పలుకగా తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు, జి.ఎస్.ఎల్. మెడికల్ కళాశాల చైర్మన్, డాక్టర్ గన్ని భాస్కరరావు, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ద ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ డైరెక్టర్ ఏలేటి రవి బాబు, ప్రతిభ స్కూల్ డైరెక్టర్ ఎస్ కె ఎస్ ఆర్ సి. మూర్తి, అక్షర శ్రీ విద్యానికేతన్ డైరెక్టర్ టి.నాగరత్నం సత్కారం అందుకున్నారు. కార్యక్రమాన్ని ఆద్యాంతం శ్రీహరికోట షార్ ఎల్ఎస్ఎస్ఎఫ్ జనరల్ మేనేజర్, ఉత్సవాల ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఎన్. విజయకుమార్, రాజమహేంద్రి మహిళా కళాశాల చైర్మన్ టి. కె. విశ్వేశ్వర రెడ్డి, పలువురు ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బంది, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత బాలాత్రిపుర సుందరి, అక్షర శ్రీ స్కూల్ డైరెక్టర్ టి నాగరత్నం, ప్రయివేట్ స్కూల్స్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ నాయకులు పురెడ్ల కళ్యాణ్ రెడ్డి, రవిచంద్ర, ఏ రమేష్, పి. సురేష్, ప్రగతి మురళి, ప్రసాద్ స్కూల్ ప్రసాద్, పి గంగాధరరావు, ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు మండెల రామ్మూర్తి, అధ్యక్షులు కె పార్ధసారధి, తదితరులు పర్యవేక్షించారు.

Check Also

సమర్థవంతమైన నాయకత్వంతో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది…

-సాటిలైట్ సిటీ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న గోరంట్ల… -పిడింగొయ్యి గ్రామంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *