Breaking News

5 నుండి 18 సం.ల లోపు బడి ఈడు బాల బాలికల వివరాలు ఆన్లైన్లో ఖచ్చితత్వం తో శత శాతం నమోదు చేయాలి

-క్షేత్రస్థాయిలో విద్యాశాఖ అధికారులు, వెల్ఫేర్ అసిస్టెంట్ లు వంద శాతం జిఈఆర్ ఎన్రోల్మెంట్ కు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
క్షేత్రస్థాయిలో 5 నుండి 18 సం.ల లోపు బడి ఈడు బాల బాలికల వివరాలు ఆధార్ నమోదుతో ఖచ్చితత్వం తో ఆన్లైన్లో శత శాతం నమోదు చేయాలని, జిఈఆర్ వందశాతం ఉండేలా మండల విద్యాశాఖ అధికారులు, ఇంటర్మీడియేట్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి తెలిపారు.

సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సర్వే నివేదిక పై, బడి బయట పిల్లలను బడిలో చేర్పించేందుకు, విద్యార్థుల సమాచారం 100 శాతం ఆధార్ అనుసంధానంతో ఆన్లైన్లో నమోదు చేయడానికి జిల్లా విద్యా శాఖ అధికారి, ఇంటర్మీడియేట్ అధికారులు, మండల విద్యా శాఖ అధికారులు, జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారి వారితో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతం పెంచే దిశగా సంబంధిత అధికారులు కృషి చేయాలని తెలిపారు. ఇంకనూ బడిలో చేరని, నమోదు కాని, సర్వే రిపోర్ట్ కు చైల్డ్ ఇన్ఫో ఆన్లైన్ వివరాలకు వ్యత్యాసం లేకుండా నిజంగా బడి బయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్పించేలా, డూప్లికేట్ ఎంట్రీ లు లేకుండా ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇందు కొరకు క్షేత్రస్థాయిలో డిఎల్డిఓ లు మండలాలకు వెళ్లి అక్కడే సంబంధిత ఎంపిడిఓ లు, ఎంఈఓ లు, వెల్ఫేర్ అసిస్టెంట్ లకు విద్యార్థుల సమాచారం యాక్టివ్, రీటేక్, వలస తదితర వివరాలు అప్డేట్ కొరకు ఆన్ హ్యాండ్ శిక్షణ ఇవ్వాలని సూచించారు.

మండల విద్యాశాఖ అధికారులు వెల్ఫేర్ అసిస్టెంట్లు, వాలంటీర్లను సమన్వయం చేసుకొని జి ఈఆర్ 100% జరిగేలా చూడాలని తెలిపారు. జి ఈఆర్ సర్వే పూర్తయిన తర్వాత ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు, అందులో పదవ తరగతి పాస్ అయి, ఇంటర్మీడియట్ జాయిన్ అయిన పిల్లలు, ఇంటర్ పూర్తి అయిన విద్యార్థుల వివరాల అప్డేట్, పాఠశాలలో కళాశాలలో చేరిన పిల్లల వివరాలను, వలసపోయిన విద్యార్థులను గుర్తించి వారి వివరాలను సంబంధిత పాఠశాల కళాశాల యాజమాన్యాలు 100 శాతం చైల్డ్ ఇన్ఫో పోర్టల్ లో నమోదు చేయాలనీ అన్నారు. ప్రతి బడి ఈడు పిల్లవాడు బడిలో ఉండేలా అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.

డి ఎల్డి ఓ వివరిస్తూ సర్వే పూర్తి అయిన తర్వాత కూడా ఏమైనా పొరపాట్లు ఉంటే మళ్లీ వాలంటీర్ల యాప్ లో రీ సర్వే చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. జి ఈ ఆర్ నమోదు ప్రక్రియ ను వెల్ఫేర్ అసిస్టెంట్లు బాధ్యతగా తీసుకొని పూర్తి చేయాల్సి ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, ఇంటర్మీడియేట్ అధికారులు, డి ఎల్ డి ఓ సుశీలా దేవి, వాణి, ఆదిశేషా రెడ్డి సర్వ శిక్ష అభియాన్ అధికారులు, ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *