Breaking News

జర్నలిస్టుల పిల్లలకు విద్యా ఫీజుల్లో 50 శాతం రాయితీ

-జర్నలిస్టు ల ప్రధాన సమస్యలను కలెక్టర్ ఢిల్లీ రావు ద్రుష్టికి తీసుకెళ్లిన ఎపియుడబ్ల్యూజే నేతలు
-జర్నలిస్టు ల పిల్లలకు 50 శాతం రాయితీకి సంబంధించి ప్రత్యేక సర్క్యలర్ జారీ చేస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్
-హెల్త్ కార్డులకు సంబంధించి కొద్ది రోజుల్లోనే అధికారులతో సమావేశం నిర్వహించి ఎక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ను పూరిస్తామని హామీ
-ఇళ్ల స్ధలాలు, జర్నలిస్టు ల ఇతర సమస్యలపై మీట్ క్లారిటీ ఇచ్చిన కలెక్టర్
-మీట్ ది ప్రెస్ లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిస్టుల పిల్లలకు స్కూళ్ల ఫీజుల్లో 50 శాతం రాయితి సర్క్యులర్ ఇస్తామని ఎన్ టి ఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు హామీ ఇచ్చారు.దీనిపై డిఈవో కు ఇప్పటికే ఆదేశించాం..సాయంత్రం కల్లా సర్క్యులర్ జారీ చేస్తాం అని ఆయన హామీ ఇచ్చారు. విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కంచల జయరాజ్ అధ్యక్షతన బుధవారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ జరిగింది.ముఖ్యఅతిథిగా హాజరయిన కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ జర్నలిస్టుల హెల్త్ కార్డు లకు సంబంధించి కొంత గ్యాప్ ఉందని, చాలా చోట్ల అమలు కావడం లేదని నా ద్రుష్టికి తెచ్చారు. త్వరలొనే హెల్త్ కార్డులు పూర్తి స్ధాయిలో అమలయ్యేలా ఆ గ్యాప్ ను అధికారులతో సమావేశం నిర్వహించి పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. హెల్త్, ఎడ్యుకేషన్ జర్నలిస్టు లకు వర్తించేలా చొరవ తీసుకుంటా నన్నారు.ఇళ్ళ స్ధలాల కు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తాన్ని హామీ ఇచ్చారు. జగనన్న ఇళ్ల పట్టాలకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకుంటే వర్తింపచేస్తామన్నారు. లేదంటే కొంత రుసుం పెట్టుకుంటే ఇళ్ల స్ధలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జగనన్న హౌసింగ్ కు అర్హులైన ప్రతిఒక్కరు అప్లై చేసుకోవచ్చుని పేర్కొన్నారు. ల్యాండ్ అలాట్ చేయమన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ చెప్పారు. జర్నలిస్టు ల సమస్యలు నా ద్రుష్టికి తీసుకువస్తే త్వరితగతిన పరిష్కరిస్తాం .. సంక్షేమ పధకాల అమలు లో అవినీతి తగ్గింది అని కలెక్టర్ చెప్పారు. ఈ నెల 15 నుంచి 23 వరకు దసరా ఉత్సవాలు జరుగుతాయని, ఈ ఏడాది 23 దసరా రోజున తెప్పోత్సవం నిర్వహిస్తాం ..గతేడాది వరదల వలన నిర్వహించలేకపోయాం అన్నారు. మూలానక్షత్రం రోజున భక్తులకు సజావుగా దర్శనం అయ్యేలా పకడ్భందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి రోజు దుర్గమ్మ దర్శనార్ధం వేలాదిగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నాం . అంతరాలయం దర్శనానికి పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నాం.
20 లక్షల ప్రసాదాలను సిద్దంగా ఉంచాం . ఘాట్ల వద్ద పుణ్యస్నానాలాచరించే భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేశాం అని కలెక్టర్ వివరించారు. వివిఐపి లు దర్శనానికి వస్తే ముందుగానే సమాచారం ఇస్తే ప్రోటోకాల్ ఇబ్బందులు తెలత్తకుండా దర్శన ఏర్పాట్లు చేస్తాం .జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 300 క్యాంపులు ఏర్పాటు చేశాం..ప్రతి రోజు 400 మందికి పైగా క్యాంపులకు వస్తున్నారు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా త్వరితగతిన వైద్య పరీక్షలు చేస్తున్నాం..ఎక్కడా మందుల కొరత లేదు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో వైద్యులను అందుబాటులో కి ఉంచాం ..వైద్యుల విషయంలోనూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం.
జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలంతా హ్యాపీ ఫీలవుతున్నారు అని ఢిల్లీ రావు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా లే అవుట్లను సామర్లకోటలో ఈ నెల 12 న సిఎం ప్రారంభిస్తారు.. ఎన్ టి ఆర్ జిల్లా మైలవరం లో లేవుట్ ప్రారంభమవుతుంది . జగనన్న కాలనీలను అద్భుతంగా తీర్చి దిద్దుతాం అని తెలిలారు.. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ విజయవాడ అధ్యక్షులు చావా రవి గౌరవాధ్యక్షులు ఎస్కే బాబు ప్రెస్ క్లబ్ కార్యదర్శి నాగరాజు ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిటీ కార్యదర్శి వసంత్ తోపాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *