Breaking News

బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేసిన హోం మంత్రి తానేటి వనిత

కొవ్వూరు , నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీ 21వ వార్డుకు చెందిన చెందిన కాసాని పద్మకు సీఎంఆర్ఎఫ్ క్రింద 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అందజేశారు. బుధవారం హోంమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబానికి చెక్ ను పంపిణీ చేశారు. కాసాని పద్మ భర్త కాసాని ఏసు లారీ డ్రైవర్ గా పనిచేస్తూ 05-07-2023న దొమ్మేరులో హెచ్.పి. బంక్ వద్ద ఖాళీస్థలంలో వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి చనిపోయారు. వైఎస్సార్ భీమా పథకంలో భర్త ఏసు పేరు నమోదుకాకపోవడంతో భీమా ఆర్ధిక సాయం అందలేదు. ఇద్దరి ఆడపిల్లలతో తల్లి దుర్గ పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే తానేటి వనిత వద్దకు తీసుకురాగా.. హోంమంత్రి వెంటనే స్పందించి ముఖ్యమంత్రి ఆర్థిక సహాయానికి సిఫారసు చేయడం జరిగింది. తమ కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయిన సమయంలో 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, మంత్రి తానేటి వనితకు ఎప్పుడూ రుణపడి ఉంటానని బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పతివాడ నాగమణి, మద్దిపట్ల సాయి గీత, నాయకులు పతివాడ రామారావు, దొరబాబు, సుర్గ నగేష్ పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *