తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
బాల్య వివాహ రహిత సమాజాన్ని నిర్మించడానికి మనం అందరం కృషి చేయాలని పిడి డిఆర్డిఎ జ్యోతి అన్నారు. సోమవారం ఉదయం బాల్య వివాహ రహిత ఆంధ్ర పదేశ్ ను తీర్చిదిద్దటంలో గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు మరియు గౌరవ సీఈఓ ఇంతియాజ్ అహమ్మద్ వారు అమరావతి నుండి బాల్య వివాహల నిరోధించడం కొరకు ప్రమాణము” (Live Oath) వర్చువల్ కార్యక్రమం నిర్వహించగా తిరుపతి డి ఆర్ డి ఎ కార్యాలయం నుండి పిడి మరియు మండల సమాఖ్య మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పి డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా బాల్య వివాహలు నిరోధానికి అనేక చట్టాలు అమలు చేస్తున్నాయని, బాల్య వివాహాల వల్ల దుష్ప్రచారాలు ప్రతి కుటుంబానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా వుందని అన్నారు. బాల్య విహాహాలు చేసుకున్న వారిని గమనిస్తే వారు రక్తహీనత కలిగి అనారోగ్య పాలవుతున్నారని అన్నారు. తప్పనిసరి అమ్మాయి వయసు 18 , అబ్బాయి వయసు 21 సం.లు నిండితేనే తల్లిదండ్రులు వివాహలు చేసేవిధంగా మహిళలు తమవంతు భాద్యత నిర్వహించాలని స్వయం సహాయ సంఘాల సభ్యుల నుండి ప్రతిజ్ఞ చేపట్టారు. వర్చువల్ విధానంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …