-కులవృత్తులపై ఆధారపడే ప్రజలు పేదరికం అనే చట్రంలో ఇరుక్కోకూడదని జగనన్న చేదోడు పథకం రూపొందింది
-జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కులవృత్తులు ద్వారా జీవనం సాగించే ప్రజలు పెట్టుబడి నిమిత్తం అప్పులు చేసి ఆ మొత్తాలకు అధిక వడ్డీలు చెల్లిస్తూ, పేదరికం అనే చట్రంలో ఎన్నటికీ వారు ఇరుక్కోకూడదని భావించి ప్రభుత్వం జగనన్న చేదోడు పథకం రూపొందించి పేద మధ్యతరగతి వర్గాలను ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు . గురువారం ” జగనన్న చేదోడు ” సాయం,వరుసగా 4 వ ఏడాది పథకంను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు రూ.10 వేలు చొప్పున సాయం అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3. 25 లక్షల మంది రజకులు, నాయీ బ్రాహ్మణులు టైలరింగ్‌లో ఉన్న అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలకు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా రూ.325 కోట్లు పంపిణీ కార్యక్రమం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బహిరంగ సభలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సాయంతో కలిపి నాలుగేళ్లలో జగనన్న చేదోడు పథకానికే రూ.1,252.52 కోట్లు కేటాయించారు. రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ల జీవితాల్లో మార్పు రావాలని, వారు మిగతా ప్రపంచంతో పోటీపడి ఎదగాలన్న సంకల్పంతో జగనన్న చేదోడు పథకాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా నుంచి కలెక్టర్ పి. రాజాబాబు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న చేదోడు పథకంతో 21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగి షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏటా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున నాలుగో విడత సాయంతో కలిపి అందించిన సాయంతో కలిపి ఇప్పటికి ఒక్కొక్కరికి రూ.40 వేల ఆర్థిక సహాయం అందచేయబడింది కృష్ణాజిల్లాలో మొత్తం టైలర్స్ 6,750 మంది లబ్ధిదారులకు 6.75 కోట్లు, రజకులు 1808 మంది లబ్ధిదారులకు 1.81 కోట్లు, నాయి బ్రాహ్మణులు1245 మంది లబ్ధిదారులకు 1.24 కోట్లతో కలిపి మొత్తం 9803 అర్హులైన లబ్ధిదారులకు రూ. 9.80 కోట్ల చెక్కును కలెక్టర్ లబ్ధిదారులకు అందించారు. కృష్ణాజిల్లాలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జగనన్న చేదోడు పథకం పరిశీలిస్తే, అవనిగడ్డ నియోజకవర్గంలో నాయి బ్రాహ్మణులు, రజకులు, టైలర్స్ తో కలిపి మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1120 మంది వీరికి రూ. 1.12 కోట్లు, మచిలీపట్నం నియోజవర్గంలో 2290 మంది లబ్ధిదారులకు రూ. 2.29 కోట్లు, పెడన నియోజవర్గంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 959 మందికి రూ. 0.96 కోట్లు, గుడివాడ నియోజకవర్గంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1012 మంది కాగా వీరికి రూ.1.01 కోట్లు, పామర్రు నియోజవర్గంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1046 మంది వీరికి రూ. 1.04 కోట్లు, పెనమలూరు నియోజకవర్గం లో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1980 మంది వీరికి రూ.1.98 కోట్లు అందజేయగా గన్నవరం నియోజవర్గంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1396 మంది కాగా వీరికి రూ.1.40 కోట్ల నగదు మొత్తాన్ని అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, ఇందులో భాగంగానే రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్ల ఆర్థికాభివృద్ధికి జగనన్న చేదోడు పథకంతో ఏటా ఒక్కొక్కరికి రూ.10 వేలు అందిస్తూ చేదోడుగా నిలుస్తుందని అన్నారు. వచ్చిన నగదుతో ఆయా వృత్తుల వారికి అవసరమైన పరికరాలు, ముడి సరుకు కొనుగోలుకు ఉపయోగించుకోవాలని కలెక్టర్ సూచించారు లబ్దిదారులు అభిప్రాయాలు: షేక్ సల్మా, వలంద పాలెం, మచిలీపట్నం: ఇస్త్రీ చేయడం ద్వారా కుటుంబ పోషణ కొనసాగిస్తున్నానని షేక్ సల్మా అన్నారు. తనకి జగనన్న చేదోడు రెండోసారి సహాయం అందిందని ఆమె చెబుతూ, తన వృత్తిలో ఎంతో అవసరమైన ఇస్త్రీ పెట్టెను కొనుగోలు చేశానని, పనిలో నాణ్యత కనబరచడంతో పలువురు తన వద్ద ఇస్త్రీ చేయించుకుంటున్నారని తద్వారా తనకు ఆదాయం పెరిగిందని సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగనన్న తమ కుటుంబానికి ఎన్నో సహాయం చేశారని అమ్మ ఒడి పథకం అందడం ద్వారా పిల్లల చదువులకు ఉపయోగించాలని, ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ జరుగుతుందని సల్మా సంతోషం వ్యక్తం చేసింది.తమలాంటి పేద ప్రజలకు అండగా నిలుస్తున్న జగనన్నకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని, మళ్లీ ఆయనే సీఎంగా రావాలని మనసారా కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. కొడాలి సీతారామరాజు, భాస్కరపురం మచిలీపట్నం : బార్బర్ షాపు నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న నేను నేటితో కలిపి మూడు విడతలుగా జగనన్న చేదోడు లబ్దిని పొందాను. వచ్చే ఈ నగదుతో షాపులో అద్దాలు, రివాల్వింగ్ కుర్చీలు, అవసరమైన కత్తెర్లు ఇతర వస్తువులు కొనుక్కొంటాను. తనలాంటి ఎందరో నాయి బ్రాహ్మణులు పెట్టుబడి కోసం ఎవరి వద్ద చేయించడం లేదని, తమ అభ్యున్నతి కోసం జగనన్న చేదోడు పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నగర పాలక సంస్థ మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, జిల్లా రెవెన్యూ అధికారిణి పెద్ది రోజా, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ. శ్రీనివాసరావు ఇతర అధికారులు, పలువురు లబ్దిదారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News