-అత్యంత భక్తశ్రద్ధలతో శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవార్ల కు పూజలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
చెడుపై మంచి సాధించిన విజయం కు మారుపేరుగా ప్రతి ఏటా దసరా నవరాత్రులు జరుపుకుంటామని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రాజమహేంద్రవరం దేవిచౌక్ లో వేంచేసి ఉన్న ప్రముఖ శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి ఆలయం లో శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవార్ల అలంకరణ లో ఉన్న అమ్మవారిని కుటుంబ సభ్యులుతో కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం కు దేవిచౌక్ అమ్మవార్ల ఆలయం కు దర్శనీయ ప్రదేశంగా ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. జిల్లా ప్రజలు సుఖ: సంతోషాలతో ఉండాలని అమ్మవార్ల ని కోరుకోవడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం మంచి అనుభూతిని కల్గించిందని మాధవీలత పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు కలెక్టర్ దంపతులకు స్వాగతం పలికి, అమ్మవారి సన్నిధిలో పూజాది కార్యక్రమాలు నిర్వహింప చేశారు. అనంతరం అమ్మవారి ప్రసాదం , చిత్రపటాన్ని బహూకరించారు.