రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
సిఎం పర్యటన నేపథ్యం ఏ ఎస్ ఎల్ లో కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సిఎం సెక్యూరిటీ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 26వ తేదీ గురువారం రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో జరిగే ప్రవేటు కార్యక్రమానికి విచ్చేయుచున్న సందర్భంగా ముందస్తు భద్రతా ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత, ఎస్పీ పి. జగదీష్ లు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం దివాన్ చెరువు సమీపంలోని డిబివి రాజు లే అవుట్ వద్ద హెలిపాడ్, రూట్ మ్యాప్ పాయింటింగ్ లను జిల్లా కలెక్టర్ కె మాధవీలత, ఎస్పీ పి జగదీష్ , శాసనసభ్యులు జక్కంపూడి రాజా ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ స్థానికంగా రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో నిర్వహిస్తున్న ప్రైవేటు కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కానున్న నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్ల పై క్షేత్ర స్థాయిలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలన చేసి, దిశా నిర్దేశం చేశామన్నారు. సిఎం పర్యటనను విజయవంతం కావడంలో అధికారులు పూర్తి సమన్వయం సాధించడం ముఖ్యం అని స్పష్టం చేశారు. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.
ఈనెల 26 గురువారం ఉదయం 10.15 కు గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి 10.25 కి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరి 11.15 కు దివాన్ చెరువు డిబివి లే అవుట్ కు చేరుకుని అక్కడ ప్రజా ప్రతినిధులతో 11.25 వరకు కలవడం జరుగుతుంది. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి ఉ.11.30 కు
డిబివి లే అవుట్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకుని రిసెప్షన్ లో పాల్గొని, అక్కడ నుంచి ఉ.11.45 కు బయలుదేరి హెలిప్యాడ్ వద్దకు ఉ.11.50 కు చేరుకుని, తదుపరి ఉ.11.55 కు హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరి తాడేపల్లి కి మ.12.55 కు చేరుకుంటారు.
జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎస్పీ పి. జగదీష్ లు నగరపాలక సంస్థ, ఆర్ అండ్ బీ, పంచాయతీ, పోలీస్ , ఇతర సమన్వయ శాఖల అధికారులకు ముందస్తు భద్రత, ఇతర ఏర్పాట్ల పై దిశా నిర్దేశం చెయ్యడం జరిగింది.
ఈ సందర్శన కార్యక్రమం లో ఎస్పీ పి. జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, సిఎం సెక్యూరిటీ అధికారులు ఏ ఎన్ రంగబాబు, పి ఎం రాజు, ఆర్ అండ్ బి అధికారి ఎస్ బి వి రెడ్డి, డ్వామా పిడి పి. జగదాంబ, డి ఈ బివివి మధుసూధన్, స్థానిక ప్రతినిధులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.