Breaking News

జిల్లా లోని ప్రైవేటు హాస్పిటల్స్ తనిఖీలు చేయాలి.

-జిల్లా స్థాయి వైద్య ఆరోగ్య సలహా మండలి కమిటీ సమావేశం
-వైద్య అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం
-జిల్లా కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని అన్ని ఆసుపత్రులలో ప్రజారోగ్య సంరక్షణపై చట్ట పరమైన ప్రభుత్వ విధి విధానాలను తప్పని సరిగా పాటించాలని , వాటికి సంబంధించి చేపట్టిన తనిఖీల్లో తెలుసుకున్న అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని, ఏ విధమైన లోపాలు ఉన్నా అటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత హెచ్చరించారు.

స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం బుధవారం జిల్లా కలెక్టర్ డా. మాధవీ లత అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ జిల్లా స్థాయి సలహా మండలి కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత మాట్లాడుతూ, ఇప్పటికే తనిఖీలు నిర్వహించిన ఆసుపత్రులకు చెంది ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదిక రూపంలో అంద చెయ్యాలని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల నందు మార్గదర్శకాలు మేరకు సంబంధించిన అన్ని వివరాలు విధిగా అమలు జరిగేలా ఉండాలని ఏ విధమైన లోపాలు ఉన్నా వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

జిల్లాలో వున్న 73 హాస్పిటల్ పై ఇప్పటికే కొన్ని హాస్పటల్స్, ల్యాబ్ లలో తనిఖీలు నిర్వహించామని లోపాలు వున్న ల్యాబ్స్ , ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని అని జిల్లా వైద్య గణాంకాధికారి జే. కుమారస్వామి తెలియ చేశారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కే. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు గా ఏర్పడి జిల్లాలోని 428 హాస్పిటల్స్ ను తనిఖీలు చేసినట్లు తెలియ జేశారు. ఇన్స్పెక్షన్ సమయంలో ఉన్న లోపాలను సరి చేయడానికి వారికి నోటీసులు కూడా ఇవ్వటం జరిగిందని ఆయన కలెక్టర్ కు వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కె వెంకటేశ్వరావు, జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ పి లక్ష్మీదేవి, అప్నా (ఆంధ్రప్రదేశ్ నర్సింగ్    హోమ్స్ అసోసియేషన్ ) ప్రెసిడెంట్ డాక్టర్ విజయ్ కుమార్, ఐఎంఎస్ సెక్రటరీ డి.సతీష్, డి ఆర్ డి ఏ పి డి మరియు జిల్లా గణాంక శాఖ అధికారి కుమారస్వామి, డిప్యూటీ జిల్లా గణాంక, అధికారి భాస్కర్ ఎం పి హెచ్ ఈ ఓ లు నాగు, రాజు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *