Breaking News

9న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై ధర్నా


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఉత్తర్వులు 117 ను రద్దుచేసి 3, 4, 5 తరగతుల తరలింపు నిలిపివేయాలని, ఏపీ జిపిఎస్ విధానాన్ని ఉపసంహరించుకొని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్) ఆధ్వర్యంలో డిసెంబర్ 9న విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం చేపడుతున్నామని ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కె.నరహరి, ఎన్ వి. రమణయ్య తెలిపారు. అదివారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు 117, 128, 84, 85 ల ప్రభావంతో వేలాది ప్రాథమిక పాఠశాలలో మూతకు గురవుతున్నాయని, ప్రాథమిక తరగతులు అందుబాటులో లేక పేద పిల్లలు ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అనేక రాష్ట్రాలు సి.పి.ఎస్. రద్దు చేసి ఓ.పి.ఎస్. అమలు చేస్తున్నందున మన రాష్ట్రంలో ఓ.పి.ఎస్. అమలు సాధ్యంకాదని పొంతనలేని లెక్కలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, పలు సమస్యల మీద ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చొరవచూపాలని డిమాండ్ చేశారు. పలు ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం త్వరత గతిన పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో పూర్వ అధ్యక్షులు ఇ. కృష్ణయ్య, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.అరుణ, కృష్ణా జిల్లా అధ్యక్షులు కె.రాజేంద్ర ప్రసాద్, కె. సాల్మన్ రాజు, ఎస్ కె. ఫయజుల్లా, డిటిఎఫ్ సభ్యులు, ఫెన్షనర్స్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *