Breaking News

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కీ ఘనంగా నివాళులు అర్పించిన జనసేన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ్యాంగ నిర్మాత, దేశంలోని ప్రజలందికీ సమాన హక్కులు కల్పించిన ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకుని పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్  అంబేడ్కర్ కి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దనున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి  పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్, విజయవాడ నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రతీవక్కరు కూడా సమాన హక్కులు పొందాలనే ఆలోచనతో రాజ్యాంగం ద్వారా మనకి హక్కుల్ని ప్రసాదించిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్ అని వారు ఎన్నో కష్టాల్ని,ఇబ్బందుల్ని అవమానాల్ని ఎదుర్కొని భారతదేశంలోని బడుగు బలహీనవర్గాల కోసం, దళిత బహుజనుల కోసం వారి అభివృద్ధి కోసం సంక్షేమం కోసం నిత్యం పరితపించిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్ అని, అంబేడ్కర్ ఆశయాలని, స్ఫూర్తిని పునికి పుచ్చుకొని ఈరోజు చాలామంది నాయకులు రాజకీయాల్లో గాని ఇతర రంగాల్లో గాని రాణించడం జరుగుతుందని అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం మన రాష్ట్రంలో అమలు అవుతుందా లేదా అనేది మనమందరం కూడా ఆలోచించాలని అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మన అందరికీ సమాన హక్కులు ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం ఎంత వివక్షకు గురవుతున్నాము, ఎంత అణిచివేతకు గురవుతున్నాం, మన ప్రాథమిక హక్కుల్ని కూడా ఏ విధంగా కాల రాస్తున్నారో అనే అంశాన్ని మనం అందరం కూడా గమనించాలి అని ఈ ప్రభుత్వంలో మనకి వాక్కు స్వతంత్రం కూడా లేదని ఈ ప్రభుత్వము యొక్క అన్యాయాన్ని అక్రమాన్ని ప్రశ్నిస్తే సిఐడిని, పోలీస్ వ్యవస్థని ఉపయోగించి మన మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఎస్సీ ఎస్టీలను వేదిపులకు గురి చేసి జైల్లో పెట్టినటువంటి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డిఅని,ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వారి అభివృద్ధికి ఉపయోగించకుండా నవరత్న పథకాలు అంటూ ఆ నిధులను మళ్లించి ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధిని నిర్వీర్యం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని, బడుగు బలహీన వర్గాలకి దళితల అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అదేవిధంగా రాష్ట్రంలో యువతకు ఒక్క ఉద్యోగాలే కాకుండా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో వారికి పెట్టుబడి అందిస్తే వ్యాపారాలు చేసుకుని అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో వడ్డీ లేని పది లక్షల రూపాయల ఆర్థిక సాయం వారికి అందించాలనే అంశాన్ని మ్యానిఫెస్టోలో చేర్చిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఎమ్మెల్సీ అనంత్ బాబు ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అతని ఎమ్మెల్సీ పదవిని బర్తరఫ్ చేయకుండా అతన్ని తొలగించకుండా అతని ఊరేగింపులు చేసుకోవడానికి కూడా అనుమతించినటువంటి దుర్మార్గుడు జగన్ అని, ఎస్సీ ఎస్టీ లీగల్ సెల్ కి అంబేద్కర్ లీగల్ సెల్ అని నామకరణం చేసినటువంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అని దామోదరం సంజీవయ్య ఆవిర్భావ సభ మా సభ ప్రాంగణానికి పేరు పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అటువంటి నిస్వార్ధపరుడైన ప్రజా నాయకుడిని బడుగు బలహీన వర్గాల, దళిత వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కి రాబోయే ఎన్నికల్లో అండగా నిలవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షులు వడ్లాది శ్యామ్,కమల సోమనాథం నూకరాజు, డివిజన్ అధ్యక్షులు సోమీ గోవింద్ జల్లి రమేష్, కత్తి రామయ్య, దారా రాము, పాల రజిని, సోమి మహేష్ , పొట్నూరి శ్రీనివాసరావు, కోరగంజి వెంకటరమణ,బొమ్ము రాంబాబు, అడ్డూరి తమ్మారావు,మల్లెపు విజయలక్ష్మి, ఏలూరు సాయి శరత్, తిరపతి అనూష, నల్లబెల్లి కనకారావు, రాము గుప్తా, ఆకుల రవిశంకర్, బట్ట సాయికుమార్, మొబీనా, గన్ను శంకర్ ,పులి చేరి రమేష్, పిల్ల రవి,బెవర లోకేష్, బావిశెట్టి శ్రీను,దాసిన జగదీష్ నోచర్ల పవన్ కళ్యాణ్,L. ప్రశాంత్, పైలా రోహిత్, అఖిల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *