Breaking News

నన్నయలో వైభవంగా ప్రారభమైన జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు

-ప్రారంభించిన మంత్రులు ఆర్. కె. రోజా, శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తరతరాల చరిత్ర కలిగిన రాజమహేంద్రవరంలో నన్నయ విశ్వవిద్యాలయంలో జాతియ స్థాయి క్రీడలు జరగడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, జిల్లా ఇన్చార్జి సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు.

శనివారం ఆదికవి నన్నయ యూనివర్సిటీలో సౌత్ అండ్ వెస్ట్ జోన్ వెయిట్ లిఫ్టింగ్ జాతీయస్థాయి క్రీడా పోటీలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా నన్నయ వీసీ ఆచార్య కె.పద్మరాజు,  ముఖ్యఅతిథులుగా టూరిజం, సాంస్కృతిక, యువజన మరియు క్రీడాశాఖ మంత్రి ఆర్.కె.రోజా, విశిష్టాతిథులుగా రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మరియు తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జ్ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ మార్గాని భరత్ రామ్, ఎం.ఎల్.ఎ. జక్కంపూడి రాజా ఇంద్రవందిత్ హాజరైయ్యారు. అతిథులకు గార్డ్ ఆఫ్ హానర్ తో ఘనంగా స్వాగతం పలికారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వెయిట్ లిఫ్టర్స్ కు శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ కరణం మల్లేశ్వరి మనకు మొదటి ఒలింపిక్ పతకాన్ని తీసుకువచ్చారని, కోడి రామ్మూర్తి వంటి క్రీడాకారులు గొప్ప స్ఫూర్తిదాయకమన్నారు.
తరతరాల చరిత్ర కలిగిన రాజమహేంద్రవరంలో నన్నయ విశ్వవిద్యాలయంలో జాతీయస్థాయి క్రీడలు జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి స్థాపించిన విశ్వవిద్యాలయం దినదినాభివృద్ధి చెందాలని పురుషులతో పాటు స్త్రీలు కూడా గొప్ప శక్తివంతంగా అన్ని రంగాల్లోనూ ఎదుగుతున్నారని మీ అందరికీ ఎప్పుడూ ప్రభుత్వము సహకారంగా ఉంటుందన్నారు.

జిల్లా ఇన్చార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ  మాట్లాడుతూ కరణం మల్లేశ్వరి, మేరీకోమ్  మనకు ఎంతో ఆదర్శమని తెలియజేస్తూ విశ్వవిద్యాలయ స్థాపనకు కృషి చేసిన రాజశేఖర్ రెడ్డి గారిని జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చారు.
స్పోర్ట్స్ మినిస్టర్ అయిన రోజా గారు స్పోర్టివ్ మినిస్టర్ వారి వల్ల ఎంతో మంది విద్యార్థులకు క్రీడా పరమైనటువంటి ప్రయోజనాలను అందించేందుకు కృషి చేస్తున్నారని, విద్యార్థులు చాలా స్ఫూర్తివంతంగా ఎదగాలని శుభాకాంక్షలు తెలిపారు.

సభాధ్యక్షులు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కె. పద్మరాజు సౌత్ అండ్ వెస్ట్ ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కార్యక్రమానికి స్వాగతం పలికారు. ఆరోగ్యకరమైన క్రీడా పోటీలకు రాజమహేంద్రవరంలో నన్నయ విశ్వవిద్యాలయం వేదిక అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ విద్యాలయాన్ని స్థాపించడానికి కారకులైన వైయస్ రాజశేఖర్ రెడ్డి, జక్కంపూడి రామ్మోహన్ రావు అని తెలియజేశారు. అలాగే విద్యాపరమైన ప్రభుత్వ పథకాలను ప్రస్తావన చేశారు. ప్రస్తుతం  సుమారుగా 90 విశ్వవిద్యాలయాల నుండి 800 మంది పాల్గొంటున్నారని తెలియజేశారు. జె ఎన్ టి యు ఉపకులపతి ఆచార్య ప్రసాదరాజు మరియు సెంచూరియన్ యూనివర్సిటీ చాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజు  ఈ పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య హేమచంద్ర రెడ్డి  మాట్లాడుతూ వివేకానందుడు చెప్పిన బలమే జీవనం బలహీనతే మరణం అనే మాటను గుర్తుచేస్తూ మన క్రీడలు గొప్ప బలాన్ని ఆరోగ్యాన్ని మనకు కలిగిస్తాయని ఈ పోటీల్లో పాల్గొంటున్న దేశవ్యాప్తంగా సుమారుగా 11 రాష్ట్రాల ప్లేయర్స్ అందరికి శుభాకాంక్షలు అందించారు.

ఎంపీ మార్గాని భరత్ రామ్  కేంద్రానికి మొట్టమొదటిసారిగా ఖేలో ఇండియా ప్రాజెక్టు తరఫున 20 కోట్ల నిధులకు ప్రపోజల్స్ పంపించామని అందులో మొదటి విడతగా 8.3 కోట్ల రూపాయలు విడుదలైనవని దీనితో ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని నిధుల్ని విశ్వవిద్యాలయ క్రీడలకు సంబంధించి ప్రయత్నం చేద్దామని నేటి పోటీదారులందరికీ ఆయన శుభాకాంక్షలు అందించారు.

స్థానిక శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ విశ్వవిద్యాలయం చాలా కొత్త కోర్సులతో సౌకర్యాలతో ఎదుగుతుందని ఈ విశ్వవిద్యాలయం తమ నియోజకవర్గంలో ఉండటం సంతోషదాయకమని ఇలా ఎదుగుతూ జాతీయస్థాయి పోటీలను నిర్వహించే స్థాయికి వచ్చింది ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ సహకరించేందుకు సిద్ధంగా ఉండని వీసీ పద్మరాజు ఉన్నత విద్యా మండలి సహకారంతో నన్నయ విశ్వవిద్యాలయాన్ని ఒక మోడల్ యూనివర్సిటీగా తయారు చేయడానికి కృషి చేస్తున్నారని,సమీపంలోని దివాన్ చెరువులో కూడా స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి స్టేడియం ని నెలకొల్పే పనిలో ఉన్నామని తెలియజేస్తూ క్రీడాకారులకు శుభాకాంక్షలు అందించారు.

జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ భరత్ గెలిసినవారికి పతకాలు లభిస్తాయి, ఓడిన వారికి అనుభవాలు మిగులుతాయని, క్రీడలు గొప్ప ఆరోగ్యాన్ని మనకు అందిస్తాయని,ప్రభుత్వం ఆడుదాం- ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టి యువతలో ఉన్న ఉత్సాహానికి వేదికని ఇస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమాన్ని విద్యా కళాశాల ప్రిన్సిపాల్ డా.కె. సుబ్బారావు, పి.డి. డా.రాంగోపాల్ , విశ్వవిద్యాలయ క్రీడా విభాగం అధ్యాపకులు నిర్వహించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *