Breaking News

ధాన్యం సేకరణ పై జిల్లా యంత్రాంగం చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఖరీఫ్ 2023-2024 ధాన్యం సేకరణ పై సంయుక్త కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శనివారం ఒక ప్రకటన జారీ చేసియున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఖరీఫ్ సీజన్ 2023-24 లో రైతులు పండించిన ధాన్యానికి MSP అందించుటకు గాను జిల్లా యంత్రాంగం ఈ క్రింది చర్యలు చేపట్టియున్నారు.
రైతులు తాను పండించిన ధాన్యాన్ని MSPకంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు మీడియేటర్సకు, మిల్లర్సకు అమ్ముకోకుండాగా మరియు మిల్లర్స అక్రమంగా ఆన్లోడ్ ఛార్జీలు క్రింద డబ్బులు వసూలు చేయకుండాగాను DISCOLOUR ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయుటకు చర్యలు చేపట్టబడినవి . రైతులు తాను పండించిన ధాన్యం అమ్ముకొను విషయం లో మిల్లర్సని గాని మరియేతర మీడియేటర్సకు గాని కలవనవసరం లేకుండా ఒకసారి RBKలో FTO/TRUCK SHEET తీసుకొన్న తదుపరి రైతు ధాన్యం ప్రభుత్వానికి అమ్మినట్లుగా తన ఇంటికి వెళ్లిపోవచ్చు తదుపరి సదరు ధాన్యం బాద్యతను ప్రభుత్వమే రైస్ మిల్లులలో ఆన్లోడ్ చేసి ACKNOWLEDGEMENT పొందును. రైతు సదరు ధాన్యం RBK లకు అమ్ముకున్న విషయం లో ఏదైనా అనుమానాలు వున్న యెడల సదరు విషయం ప్రభుత్వం వారి టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి వివరించిన యెడల సదరు విషయం పై చర్యలు చేపట్టి రైతుకు MSP అందించుటకు చర్యలు చేపట్టబడును.
తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2023-2024 సీజన్ లో అంచనా వేసిన వరి సేకరణ 2.52 లక్షల మెట్రిక్‌ టన్నులు గా పేర్కొని యున్నారు.
09.12.2023 నాటికి ధాన్యం సేకరణకు సంబంధించి 29099 కూపన్ లను జనరేట్ చెయుట జరిగింది.
అందుకుగాను 18493 మంది రైతుల నుండి 1,32,719.200 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చెయ్యడం జరిగినది.
ఇప్పటివరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి 20,256 FTO లకు గాను 212 కోట్ల 42 లక్షలు రైతుల ఖాతాలలో జమ చేయుట జరిగింది.
జిల్లాకు అవసరమగు గోనె సంచులకు6300000 గాను ఇప్పటికే 5582567 (88.61%) గోనె సంచులు 232 ఆర్‌బి‌కేల నందు చేర్చడం జరిగినది.
ప్రభుత్వం వారు నిర్ణయించిన కనీస మద్దతు ధర కామన్ వెరైటీ కు గాను రూ. 2183/- లు “గ్రేడ్ ఏ” కు గాను రూ. 2203/- లు చెల్లించడం జరుగుతుంది.
రైతులకు ధాన్యం రవాణాకు సంబంధించి గోనె సంచుల వినియోగ ఛార్జీలు  రూ. 3.39 పై., @ఒక్కింటికి, హమాలీ ఛార్జీలు రూ 17.17 Ps., @ ఒక క్వింటాకు చొప్పున ప్రభుత్వం ద్వారా చెల్లించబడును.
రైతులకు అవసరమైన అన్ని వసతులు కూడా అందుబాటులోకి తేవడం జరిగిందని ఆ ప్రకటనలో తెలియజేయడమైనది.
232 RBK లలో ధాన్యం కొనుగోలు PPC ల నుండి 232 DEO లను 232 TA లను మరియు 232 హెల్పేర్ లను నియమించి రైతుల సవకర్యార్థం తాత్కాలికంగా నియమించడం జరిగింది.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని PPC ల నుండి ఆన్లైన్ లో ఎంపిక కాబడిన రైస్ మిల్లు వరకు GPS పరికరాలు ఏర్పాటు చేయబడిన వాహనాలతో మాత్రమే ధాన్యం మిల్లుకు చేర్చబడుచున్నది.
ధాన్యం కొనుగోలు విషయమై సందేహాలు మరియు ఫిర్యాదుల కొరకు జిల్లా కలెక్టరు వారి కార్యాలయం వద్ద కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్‌ ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు అందుబాటులో కలదు.
కంట్రోల్ రూమ్‌  నంబర్లు : 8309487151, 0883-2940788 – కలెక్టరు వారి కార్యాలయం, తూర్పు గోదావరి జిల్లా.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *