Breaking News

ప్రజల మద్దతుతో రాబోయే ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చేది వైసీపీ నే:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం లో జనరంజక పాలన సాగుతోందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ప్రజలంతా కూడా వైసీపీ ప్రభుత్వ పాలన పట్ల తమ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని, రాబోయే ఎన్నికల్లో వారి మద్దతుతో 175 నియోజకవర్గలలో విజయకేతనం ఎగురేసి అధికారం చేజిక్కుచ్చుకొంటామని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. సోమవారం 2వ డివిజన్ ప్రసన్న మెస్ సందు, లలితాంబ వీధి,సోమయ్య వీధి,వెంకట స్వామి వీధి ప్రాంతాల్లో ప్రతి గడప గడపకి వెళ్లి ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో జగనన్న ప్రభుత్వంలో డివిజన్ లో జరిగిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించారు. గతంలో మునుపెన్నడూ లేనివిధంగా ఈ ప్రభుత్వం లోనే కొండప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని ప్రజలు సంతోషంగా మాకు ఘన స్వాగతం పలుకుతున్నారని అన్నారు.2024 లో మరలా అధికారంలోకి వచ్చే వైస్సార్సీపీ ప్రభుత్వం లో మేము చేయబోయే అభివృద్ధి పనుల మానిఫెస్టోని ప్రజలకు అందించారు. మీకు ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆధికారం లోకి వచ్చిన వెంటనే ఈ హామీలు ఆన్ని నెరవేరుస్తామని అవినాష్ భరోసా ఇచ్చారు.ఈ పర్యటనలో డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లం దుర్గ, కార్పొరేటర్ శ్రీ అంబడిపూడి నిర్మాలకుమారి, డివిజన్ అధ్యక్షులు కోటి నాగులు, ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ మోయిన్, ఎస్సీ సెల్ రీజినల్ కోఆర్డినేటర్ చందా కిరణ్ తేజ్, మండల కన్వీనర్ జగ్గా, క్లస్టర్ ఇంచార్జ్ ప్రభు, పెద్దబాబు, కనపర్తి బాబు,హజిజ్ మరియు వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *