రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు పారిశ్రామిక కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల్లో ఉపాది కల్పించు యజమానులతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం రూపొందించబడిన వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. పని ప్రదేశాలలో కార్మికులకు కనీస సదుపాయాలు కల్పించడం, భద్రతా ప్రమాణాలు పాటించడం, హానికారక పరిస్థితులలో పనిచేస్తున్న వారికి తరచుగా వైద్య పరీక్షలు చేయించడం పరిశ్రమల యాజమాన్యాల బాధ్యత అని వివరించారు. కర్మాగారల చట్టం, 1984 ప్రకారం సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్ వారు మరియు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ తమ అధికారిక పరిధిలో ఉన్న ఏ కర్మాగారాన్ని అయిన ఎప్పుడైనా తనిఖీ చేసేందుకు, ప్రమాదలకు దారితీసే యంత్రాలను స్వాదీనం చేసుకునేందుకు, రిజిస్టర్లు మరియు ఇతర డాక్యుమెంట్లను పరిశీలించేందుకు పూర్తి అధికారం కలిగి ఉంటారని వివరించారు. యాజమాన్యాలు వారి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించనిచో చట్ట పరమైన చర్యలు తప్పవని అన్నారు. ఈ సదస్సులో రాజమహేంద్రవరం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ బి.ఎస్.ఎం.వలి, రాజమహేంద్రవరం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ జి. స్వాతి, వివిధ కర్మాగారల యజమానులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
Tags rajamandri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …