Breaking News

పంటల అంచనాల సమగ్ర నివేదికను కార్యాచరణ సమయం లోగా పూర్తి చెయ్యాలి….

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వము నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి, మిచాంగ్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటల అంచనాల సమగ్ర నివేదికను కార్యాచరణ సమయం లోగా పూర్తి చెయ్యాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు.

గురువారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్. జవహర్ రెడ్డి రీ సర్వే, పట్టణ ప్రాంతాల్లో తిరిగి సర్వే,  జాతీయ రహదారులు కోసం భూ సేకరణ,  ఎం పి ఎఫ్ సి గౌడన్ల కోసం భూ సేకరణ, వ్యవసాయం; డెయిరీ డెవలప్‌మెంట్; మిల్లెట్ ప్రమోషన్, ఇంటి స్థలాలు, గృహ నిర్మాణం, విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర, ప్రాధాన్యతా భవనాలు,  ఉపాధిహామీ – వేతన ఉత్పత్తి, స్వామిత్వ, జల్ జీవన్ మిషన్ .ఆకాంక్షాత్మక జిల్లాలు/బ్లాక్స్ ప్రోగ్రామ్- కొనసాగుతున్న అభివృద్ధి పనులపై  అంశాల వారీగా సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ తరపున ప్రచారం జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ హాజరయ్యారు.

అనంతరం జిల్లా, మండల స్థాయి అధికారులకు జేసీ తేజ్ భరత్ దిశా నిర్దేశనం చేశారు.ఇటీవల మిచాంగ్ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటల నష్టాలను నిర్ణీత సమయం లోగా పూర్తి చెయ్యాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. జిల్లాలో వ్యవసాయ రంగం కు చెందిన 13,289 హెక్టర్లలో ఇప్పటి వరకు 3400 హెక్టార్ల లో ఎన్యూమరేషన్ పూర్తి చెయ్యడం జరిగిందని, మిగిలిన 10 వేల హెక్టార్ల లో ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అదే విధంగా హార్టికల్చర్ కి చెందిన సుమారు 1,730 హెక్టార్ల లో ఇప్పటి వరకు 934 హెక్టర్ల లో పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన అంచనా పనులను వేగవంతం చెయ్యాల్సి ఉందని జేసీ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా కు చెందిన ప్రగతి పై అంశాల వారీగా సమీక్ష నిర్వహించారన్నారు. ఖరీఫ్ సీజన్ కి చెంది దెబ్బతిన్న పంటల తిరిగి విత్తనాలు నాటడానికి 80 శాతం సబ్సిడీపై కావలసిన ప్యాడి 160 క్వింటాళ్ల, కందిపప్పు 450 క్వింటాళ్ల విత్తనాల కోసం ప్రతిపాదనలు పంపామన్నారు.  జిల్లాకు చెందిన జాతీయ రహదారులకు చెంది భూములు కేటాయింపులు ఏమియు పెండింగులో లేవని తెలిపారు. వికసిత సంకల్ప యాత్ర సందర్భంగా జిల్లాలో 76 గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించిన సభలకు సగటున 692 మంది వీక్షించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందచేస్తున్న పథకాల అమలులో లబ్దిదారులకు ఆయా సంక్షేమ పథకాల అందించడం జరుగుతోందని అన్నారు. సగటున 540 మంది పైగా ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపారు.

జల జీవన్ మిషన్ కింద ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు కింద గతవారం నిర్దేశించిన 3463 లక్ష్యం కు గాను 4072 (118 %)  సాధించినట్లు తెలిపారు. ఈ వారంలో జిల్లాకు 3262 లక్ష్యం ఇచ్చారని, ఆమేరకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తేజ్ భరత్ పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 46 గ్రామాల్లో 100 శాతం గృహాలకు ఇంటింటికీ ట్యాప్ కనెక్షన్స్ పూర్తి చేశామన్నారు. రెండోదశ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చెయ్యాలని ఆదేశించారు. తొలి ఫేజ్ లో లక్ష్యాలను సాధించడం లో జిల్లా ప్రథమ స్థానంలో ఉన్న తరహాలోనే రెండో దశ నిర్మాణాలు వేగవంతం చేయాలని క్షేత్ర స్థాయి అధికారులకు సూచన చేశారు. సురక్షత త్రాగునీటి పి డబ్ల్యు ఎస్ కింద 2526 యూనిట్స్ లో2302 జేజే ఎల్ కి అనుసంధానం చేసి, వాటిని జియో ట్యాగింగ్ చేసే ప్రక్రియ లో 35.58 శాతం పూర్తి చేసి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. వాటికి చెందిన వివరాలు ప్రదర్శన చెయ్యాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, జిల్లా అధికారులు ఎస్ జి టి సత్యగోవింద్, ఎస్. మాధవ రావు, వై. సరస్వతి, పి. జగదాంబ, డి. బాల శంకర రావు, ఏ బి వి ప్రసాద్, జి. పరశురామ్ , ఇతర సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *