రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలలో భాగంగా ది.15.12.2023 వ తేదీన పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు విద్యుత్ పొదుపు-ప్రాముఖ్యత మీద చిత్రలేఖనం పోటీలు మరియు విద్యుత్ పోదుపు పై మహిళా స్వయం సహాయక బృందములతో అవగాహనా సదస్సులు నిర్వహించడం జరిగిందని పర్యవేక్షక ఇంజినీరు, ఆపరేషన్ సర్కిల్, రాజమహేంద్రవరం టి.వి.ఎస్.ఎన్. మూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విద్యుత్ పొదుపు పై తమ ఆలోచన విధానాన్ని చిత్రలేఖనం ద్వారా చక్కగా చిత్రాల రూపంలో చిత్రీకరించారు. ఈ పెయింటింగు లు చిన్నారుల యొక్క సృజనాత్మకతను, ప్రతిభను మరియు విద్యుత్ పొదుపు పై అవగాహనను పెంపొందిస్తున్నా యన్నారు. విద్యార్థులకు విద్యుత్ పొదుపు పై ఉన్న అవగాహనను విద్యుత్ అధికారులు అభినందించారు.
రాజమహేంద్రవరం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు,ఆపరేషన్ టౌన్-1 వారి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం శ్రీ కందుకూరి వీరేశలింగం ఆస్థిక మహిళా కళాశాల నందు మహిళా కళాశాల విద్యార్థినులకు విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించడం జరిగినది. 155 మంది మహిళా కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు,ఆపరేషన్ రూరల్ వారి ఆధ్వర్యములో డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ గురుకులం స్కూల్ నందు విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు జరిగినవి. ఈ పోటీలలో జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాల నుంచి 70 మంది విద్యార్థులు చిత్రలేఖనం పోటీలలో పాల్గొన్నారు.
రామచంద్రపురం, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు,ఆపరేషన్ వారి ఆధ్వర్యంలో డివిజన్ ఆఫీస్ నందు మహిళా స్వయం సహాయక బృందములతో విద్యుత్ పోదుపు పై అవగాహన కల్పించడం జరిగినది.
ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు,ఆపరేషన్, కాకినాడ వారి ఆధ్వర్యంలో డి 7 సెక్షన్ కాకినాడ ఏ యమ్ జి స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్ గొల్లపాలెం, జిల్లా పరిషత్ హై స్కూల్ ఇంద్రపాలెం నందు విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు జరిగినవి. 100 మంది విద్యార్థులు చిత్రలేఖనం పోటీలలో పాల్గొన్నారు.
ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు,ఆపరేషన్, జగ్గంపేట వారి ఆధ్వర్యంలో కోటనందూరు మండలం అల్లిపాడు గ్రామం లో కస్తూరిబా గాంధీ గర్ల్స్ స్కూల్ నందు విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు జరిగినవి. 42 మంది విద్యార్థులు చిత్రలేఖనం పోటీలలో పాల్గొన్నారు మరియు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాల, జగ్గంపేట విద్యార్థినులతో విద్యుత్ పొదుపుపై జగ్గంపేట నందు అవగాహనా ర్యాలీ ని నిర్వహించటం జరిగినది.
రంపచోడవరం, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు,ఆపరేషన్ వారి ఆధ్వర్యంలో నెల్లిపాక సెక్షన్ నందు విద్యుత్ సిబ్బందితో విద్యుత్ పోదుపు పై అవగాహన కల్పించడం జరిగినది.
ఈ చిత్రలేఖనం పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు ఉత్సావాలు ముగింపు రోజున అనగా ది.20.12.2023 తేదీన బహుమతులు అందచేయటం జరుగుతుందని టి.వి.ఎస్.ఎన్. మూర్తి తెలిపారు.