రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలలో భాగంగా ది.16.12.2023 వ తేదీ శనివారం పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు విద్యుత్ పొదుపు-ప్రాముఖ్యత మీద వ్యాస రచన, చిత్రలేఖనము పోటీలు మరియు విద్యుత్ పోదుపు పై అవగాహనా సదస్సులు నిర్వహించామని టి.వి.ఎస్.ఎన్. మూర్తి, పర్యవేక్షక ఇంజినీరు, ఆపరేషన్ సర్కిల్, రాజమహేంద్రవరం తెలిపారు.
ఈ వ్యాస రచన పోటీల్లో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విద్యుత్ పొదుపు పై తమ ఆలోచనలను వ్యాసరచన ద్వారా తెలియపరిచారు. ఈ వ్యాసరచనలు చిన్నారుల యొక్క సృజనాత్మకతను, ప్రతిభను మరియు విద్యుత్ పొదుపు పై అవగాహనను పెంపొందిస్తున్నాయి. విద్యార్థులకు విద్యుత్ పొదుపు పై ఉన్న అవగాహనను విద్యుత్ అధికారులు అభినందించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఆపరేషన్, రాజమహేంద్రవరం రూరల్ వారి ఆధ్వర్యంలో కడియం జిల్లాపరిషత్ హైస్కూల్ నందు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు జరిగినవి.
ఈ కార్యక్రమంలో 45 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పందలపాక జిల్లాపరిషత్ హైస్కూల్ నందు విద్యార్థులకు విద్యుత్ పొదుపు మరియు ఆవశ్యకత మీద అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గోకవరం జిల్లాపరిషత్ హైస్కూల్ నందు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు జరిగినవి. ఈ కార్యక్రమంలో 32 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనపర్తి జిల్లాపరిషత్ హైస్కూల్ నందు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు జరిగినవి. ఈ కార్యక్రమంలో 32 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఆపరేషన్, రామచంద్రపురం వారి ఆధ్వర్యంలో కపిలేశ్వరపురం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 45 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రామచంద్రపురం టౌన్, మోడరన్ స్కూల్ నందు విద్యార్థులకు చిత్రలేఖనము పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 52 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మండపేట గౌతమి మునిసిపల్ హైస్కూల్ నందు విద్యార్థు లకు చిత్రలేఖన మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 74 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఆపరేషన్, అమలాపురం వారి ఆధ్వర్యంలో చెయ్యేరు శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాల నందు విద్యుత్ పొదుపు మరియు దాని ఆవశ్యకత మీద అవగాహనా సదస్సుని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని, విద్యార్థుల చేత విద్యుత్ పొదుపుపై ప్రదర్శింపబడిన చిత్రాలను గౌరవ టి.వి.ఎస్.ఎన్. మూర్తి, పర్యవేక్షక ఇంజినీరు, ఆపరేషన్ సర్కిల్, రాజమహేంద్రవరం వారు సందర్శించి విద్యార్థిని, విద్యార్థు లను అభినందించటం జరిగిన దన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఆపరేషన్, జగ్గంపేట వారి ఆధ్వర్యంలో జగ్గంపేట జిల్లా పరిషత్ హైస్కూల్ నందు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 46 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఏలేశ్వరం సెక్షన్ లో వినియోగదారులకు విద్యుత్ పొదుపుపై అవగాహన తెలియజేయు కరపత్రాలను పంపిణీ చేయడం జరిగినది.
ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఆపరేషన్, రాజమహేంద్రవరం టౌన్ వారి ఆధ్వర్యంలో విద్యుత్ పొదుపు మరియు దాని ఆవశ్యకత మీద ప్రచురింపబడిన పోస్టర్లను మరియు హోర్డింగ్ లను వివిధ కార్యాలయములనందు ఏర్పాటు చేయడం జరిగినది. అదే విధముగా వినియోగదారులకు కరపత్రాలను పంపిణీ చేయడం జరిగినది.
ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఆపరేషన్, పెద్దాపురం వారి ఆధ్వర్యంలో సామర్లకోట మునిసిపల్ హై స్కూల్ నందు విద్యార్థులకు చిత్రలేఖనము పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 65 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ వ్యాస రచన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు ఉత్సావాలు ముగింపు రోజున అనగా ది.20.12.2023 తేదీన బహుమతులు అందచేయటం జరుగుతుందని టి.వి.ఎస్.ఎన్. మూర్తి, పర్యవేక్షక ఇంజినీరు, ఆపరేషన్ సర్కిల్, రాజమహేంద్రవరం వారు తెలిపారు.