Breaking News

పలు రెస్టారెంట్లు మరియు ఫుడ్ సెంటర్ల పై విజిలెన్స్ అధికారుల ఆకస్మిక దాడులు

-రీజనల్ విజిలెన్స్ ఇంచార్జ్ ఎస్.పి. ఏ.సురేష్ బాబు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని రెస్టారెంట్లలో ఉపయోగిస్తున్న ఎడిబుల్ అయిల్స్ లో టోటల్ పోలార్ కాంపౌండ్స్ (TPC) మీటర్ రీడింగ్ 25శాతం లోపు వుండవలసి వుండగా దానికన్న ఎక్కువగా వుంటున్నాయని, దాని వలన ప్రజల ఆరోగ్యానికి హానికరం ఏర్పడే అవకాశం ఉంటుందని, కావున టోటల్ పోలార్ కాంపౌండ్స్ (TPC) మీటర్ రీడింగ్ 25శాతం లోపున వుండేలా రెస్టారెంట్ల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని రీజనల్ విజిలెన్స్ ఇంచార్జ్ ఎస్.పి. ఎ .సురేష్ బాబు సూచించారు. ఈ సందర్బంగారీజనల్ విజిలెన్స్ ఇంచార్జ్ ఎస్.పి… ఏ .సురేష్ బాబు మాట్లాడుతూ రెస్టారెంట్లు, బార్ల పరిసరాలు మరియు కిచెన్లు పరిశుభ్రముగా వుంచాలని, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచనల మేరకు వినియోగదారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారపధార్ధములు అందించాలన్నారు. లేనిచో సంబందిత రెస్టారెంట్ల పై  చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శనివారం తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం పట్టణములోని రెస్టారెంట్లు మరియు ఫుడ్ సెంటర్ల పై విజిలెన్స్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజి అధికారులు మరియు రెవెన్యూ అధికారులతో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగింది.

1. సిటీ హాస్పిటల్ రోడ్లో గల సురుచి ఫుడ్స్ ను తనిఖీ చేసిన విజిలెన్స్ బృందంలోని లీగల్ మెట్రాలజి అధికారులు కేకు(cake)లకు ఇచ్చు బిల్లుల నందు తూకం(weight) నమోదు చేయకపోవుట చేత ఒక్క కేసును, బాదం ఘీర్ బాటిల్స్ పై మెండిటరి డిక్లరేషన్ లేకపోవుట చేత ఒక్క కేసును, నాన్‌స్టాండర్డ్ ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ కలిగియుండుట చేత ఒక్క కేసును మొత్తం మూడు కేసులు నమోదు చేసియున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సదరు ఫుడ్ సెంటర్ నందు గల 6 (ఆరు) వెనిగర్ మరియు ప్రీమియర్ కుకింగ్ సేక్ బాటిళ్ళు గడువు ముగిసిన స్టాక్ కలిగి వుండుట చేత FSSAI చట్టం 2006లోని సెక్షన్ 27 r/w 58 ప్రకారం ఒక్క కేసును నమోదు చేసియున్నారు. సదరు ఫుడ్ సెంటర్ నందు గల ఎడిబుల్ అయిల్స్ లో టోటల్ పోలార్ కాంపౌండ్స్ (TPC) మీటర్ రీడింగ్ (9.5%) అనుమతించదగిన పరిమితులకు లోబడి గుర్తించటమైనదన్నారు.

2. జె.ఎన్ రోడ్ లో గల సితార రెస్టారెంట్ (Sitara Multi cuisine Restaurant) ను తనిఖీ చేయగా సదరు రెస్టారెంట్ నందు గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను నిల్వ వుంచుట చేత ఫుడ్ సేఫ్టీ అధికారులు FSSAI చట్టం 2006లోని సెక్షన్ 27 r/w 58 ప్రకారం ఒక్క కేసును నమోదు చేసియున్నారు. సదరు ఫుడ్ సెంటర్ నందు గల ఎడిబుల్ అయిల్స్ లో టోటల్ పోలార్ కాంపౌండ్స్ (TPC) మీటర్ రీడింగ్ (23%) అనుమతించదగిన పరిమితులకు లోబడి గుర్తించటమైనదని పేర్కొన్నారు.

3. తాడితోట లో గల “చందన ఫుడ్స్” ను తనిఖీ చేసిన విజిలెన్స్ బృందంలోని లీగల్ మెట్రాలజి అధికారులు ప్యాకేజ్డ్ ఫుడ్స్ పై మెండిటరి డిక్లరేషన్ లేకపోవుట కారణంగా 3 కేసులును, నాన్‌స్టాండర్డ్ ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ కలిగియుండుట చేత ఒక్క కేసును మొత్తం 4 కేసులు నమోదు చేసామన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సదరు ఫుడ్ సెంటర్ నందు గడువు ముగిసిన 5 (ఐదు)రకముల ఆహార ఉత్పత్తులను కలిగి వుండుట చేత FSSAI చట్టం 2006లోని సెక్షన్ 27 r/w 58 ప్రకారం ఒక్క కేసును నమోదు చేసామాని తెలిపారు.

ఈ తనిఖిలలో డి.ఎస్.పి ముత్యాలు నాయుడు, కార్యాలయ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరెడ్డి, జియాలజిస్ట్ లక్ష్మినారాయణ, వ్యవసాయ అధికారి భార్గవ మహేష్, సబ్-ఇన్స్పెక్టర్ జగన్నాధరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ జీవానందం, కానిస్టేబుల్స్ వలీ, లోవకుమార్ , కిషోర్, లోవరాజు మరియు రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు పాల్గొన్నారు .

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *