Breaking News

డిసెంబర్ 18 వ తేదీ సోమవారం యధాతధంగా కలెక్టరేట్ లో జిల్లా స్థాయి స్పందన

-కలెక్టరేట్ లో “మెగా ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం”
-రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభం
-కలెక్టర్ డా కే.మాధవీలత

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహించే  జిల్లా, డివిజన్, మండల  స్థాయి స్పందన కార్యక్రమం డిసెంబర్ 18 వ తేదీ సోమవారం యధావిధిగా  నిర్వహిస్తున్నట్లు   జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి అందరూ జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని అన్నారు. అదేవిధంగా డివిజన్ స్థాయి లో ఆర్డీవో, మునిసిపల్ స్థాయి లో కమిషనర్లు, మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి, గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ప్రజలు నుంచి సంబంధిత సిబ్బంది ప్రజల నుంచి స్పందన అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు  ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను కలెక్టరేట్ లో స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ, మునిసిపల్, మండల, గ్రామ, వార్డు సచివాలయాలలో  స్పందన ఫిర్యాదులు అందచేయాలని కలెక్టర్ తెలియచేశారు.  మండల స్థాయి అధికారులు అందరూ  మండల ప్రధాన కేంద్రంలో ఒకే చోట హాజరై ప్రజల నుంచి స్పందన అర్జీలు స్వీకరించాలన్నారు.

“మెగా ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం”
డిసెంబర్ 18, 2023న *ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచడంలో భాగంగా “మెగా ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం” రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వారిచే సోమవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి నుంచి ప్రారంభించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ మాధవీలత తెలిపారు. జిల్లా స్థాయి కార్యక్రమం కలెక్టరేట్ నందు, అదే విధంగా మునిసిపల్ , మండల ప్రధాన కేంద్రాల పరిధిలో జరిగే కార్యక్రమాలలో మంత్రులు, జెడ్పీ చైర్మన్లు, ఎంపి , ఎమ్మెల్సీ లు , ఎమ్మెల్యే లు, చైర్మన్లు, డైరెక్టర్లు , ఆయా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *