Breaking News

ప్రారంభమైన తూర్పు గోదావరి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

-రెండు రోజుల పాటు నిర్వహించనున్న విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన
-57 స్కూల్స్ నుంచి ఎంపిక చేసిన ప్రదర్శనలు ఏర్పాటు
-ఇక్కడ ఉత్తమ ప్రదర్శన గా నిలిచిన వాటిని 28 న జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతాము
-డి ఈ వో ఎస్. అబ్రహం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులలో ఉన్న సృజనాత్మకత కు పెద్ద ఎత్తున ప్రోత్సహం అందించడం జరుగుతోందని జిల్లా విద్యా అధికారి ఎస్. అబ్రహాం పేర్కొన్నారు. వారిలో ఉన్న ప్రతిభ ఎంతో ఆకట్టుకుందని ప్రత్యేకంగా అభినందించారు.

స్థానిక ఆల్కాట్ గార్డెన్స్ లోని శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాలలో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన తొలి రోజు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యా అధికారి ఎస్. అబ్రహాం మాట్లాడుతూ, పిల్లల్లో ఉన్న సృజనాత్మక ఆలోచనలను ఇటువంటి వేడుకలు ప్రోత్సాహం ఇవ్వడానికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. వివిధ స్కూల్స్ పిల్లలు ఈ ప్రదర్శన సందర్శించి వారిలో నూతన ఆవిష్కరణలకు ఎంతో దోహదం చేస్తాయని, తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా స్కూల్ లో డిసెంబర్ 14 వరకు పోటీలను నిర్వహించామన్నారు. మొత్తం 500 పైగా స్కూల్స్ ఇందులో పాల్గొనడం జరిగిందన్నారు. మండల స్థాయి లో డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన ప్రదర్శన నుంచి 57 ప్రాజెక్ట్స్ జిల్లా స్థాయి కి ఎంపిక చేసినట్లు తెలిపారు. డిసెంబర్ 20, 21 తేదీల్లో అందరూ వొచ్చి ఈ ప్రదర్శన తిలకించే ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించి పిల్లల్లోని సృజనాత్మతను ప్రోత్సహించాలన్నారు. జిల్లా స్థాయి లో ఎంపిక చేసిన ప్రాజెక్ట్స్ వైయస్ఆర్ కడప జిల్లాలో డిసెంబర్ 28 న జరిగే వైజ్ఞానిక ప్రదర్శన కోసం పంపుతామని పేర్కొన్నారు.

“కొన్ని ప్రదర్శనలు ”
బయో మెట్రిక్ ఓటింగ్ యంత్రం:

రంగంపేట జెడ్పీ హైస్కూల్ లో 9 వ తరగతి చదువుతున్న టి. ప్రసన్న, ఈ. భాను లు బయో మెట్రిక్ ఓటింగ్ యంత్రానికి రూపకల్పన చేశారు. ఈ పరికరంలో ఓటరు యొక్క వివరాలు, బయోమెట్రిక్ విధానం లో అనుసంధానం చేయడం ద్వారా ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా చూడడం సాధ్యం అవుతుంది. ఇందు కోసం ప్రతి పోలింగ్ బూత్ స్థాయి లో ఉన్న ఓటర్ల యొక్క బయో మెట్రిక్ ను ఓటింగ్ యంత్రానికి అనుసంధానం చేయడం జరగాలి. ఓటరు తన ఓటు హక్కు ను ఒక్కసారి మాత్రమే వేసుకునే అవకాశం ఉంటుందని, తద్వారా డూప్లికేట్ ఓటు వేసే అవకాశం ఉండదని ఈ పరికరం యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని ప్రసన్న భాను వివరించారు.

స్వచ్చాంద్ర గ్రామ సచివాలయం ప్రాజెక్ట్:
కడియం జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినిలు జీ. విజయలక్ష్మి, ఏ. కీర్తి లు గ్రామ సచివాలయాలు ద్వారా ఇంటింటికీ సరఫరా చేస్తున్న డస్ట్ బిన్స్ కి సెన్సార్ తో కూడిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఏర్పాటు చేసి వాటిని సచివాలయంలో ఉన్న ప్రధాన యూనిట్ కి అనుసంధానం చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే డస్ట్ బిన్ నిండుతుందో సచివాలయానికి అనుసంధానం చేసిన యూనిట్ ద్వారా హెచ్చరిక వొస్తుంది. సంబంధిత సమాచారం మేరకు చెత్త సేకరణకు సిబ్బంది రావడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వచ్చాంద్ర ప్రదేశ్ లక్ష్యంగా చేపడుతున్న చర్యలకు ఈ ప్రాజెక్ట్ ఎంతో మేలు చేకూర్చడం, తడి చెత్త నుంచి బయో కంపోస్ట్ ఎరువు తయారు చేసేందుకు అవసరమైన ముడి సరుకు కూడా సేకరణ సులభతరం చేస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం డివిజన్ ఉప విద్యా శాఖాధికారి ఈ వి బి ఎన్ నారాయణ, అర్బన్ రేంజ్ డి ఐ.బి దిలీప్ కుమార్, రూరల్ ఎమ్ ఈ ఓ ఎ. దుర్గా తులసీదాస్, జిల్లా సైన్స్ అధికారి జి.వి.ఎన్. ఎస్.నెహ్రూ, గురుకులం కరస్పాండెంట్ శ్యామ్ సుందర్,ప్రిన్సిపాల్ జి.గురవయ్య,కమిటీ సభ్యులు కోలా సత్యనారాయణ, మంగిన రామారావు, ఎస్.ఎల్.వి రమేష్, రమణారావు, గణపతి, రామానుజం, హరికృష్ణ, జాన్సన్, కె.రాజు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *