-ఏ ఎల్ ఎమ్ టి లు శిక్షణ విధుల్లో అత్యంత బాధ్యత కలిగి ఉండాలి
-ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పునశ్చరణ చేసుకోవాలి
-జిల్లా ఎన్నికల అధికారి /కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగం సాధ్యమైనంత ఎక్కువగా సద్వినియోగం చేసుకునే దిశలో పోస్టల్ బ్యాలెట్, ఆబ్సెంటీ ఓటర్ల విషయం అత్యంత కీలకమైన పాత్ర పోషించాలని, ఆమేరకు సంబంధిత సిబ్బందికి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పూర్తిగా అర్థం అయ్యేలా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఏ ఎల్ ఎమ్ టి (అసెంబ్లీ నియోజక వర్గ మాస్టర్ ట్రైనర్) ల రెండవ రోజు శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, ఈ ఆర్ ఓ లు, ఏ ఈ ఆర్ వో లు , సంబంధిత నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉదయం పోస్టల్ బ్యాలెట్ పై, మధ్యాహ్నం ఐ టి – సి విజిల్ పై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వుల మేరకు ఎన్నికల విధులలో పాల్గొనే వ్యక్తులు, ఎలెక్టర్లు పోస్టల్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయడానికి అర్హులని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగ ప్రక్రియలో క్యాబ్ (సి ఎ బి) 13 ఎ/బి/ సి/డి ఫారాలు పై అవగాహన కల్పించాలన్నారు. డిక్లరేషన్ , పోస్టల్ బ్యాలెట్ పెట్టే కవర్లు , ఓటు హక్కు వేసే ప్రక్రియ పూర్తి చెయ్యడం లో మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందన్నారు. ఏ ఫారం పరిశీలన చేసే సక్రమంగా ఉంటే, బి ఫారం ఓపెన్ చెయ్యాలి, డిక్లరేషన్ చూడాలి, చివరిగా పోస్టల్ బ్యాలెట్ చూడాలి.. మార్గదర్శకాలు పాటించని ఓటును పరిగణనలోకి తీసుకోవడం జరగదని, అందుకోసం పోస్టల్ బ్యాలెట్ పై పూర్తి స్థాయిలో అవగాహన అవసరం అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం లో భాగంగా సేవా ఓటర్లు – (భర్తతో సహా) ప్రాక్సీ ఓటింగ్‌ని ఎంచుకున్న వారు తప్ప, యూనియన్ సాయుధ దళాల సభ్యులు , ఆర్మీ చట్టం, 1950 వర్తించే ఇతర దళాల సభ్యులు , రాష్ట్రం వెలుపల పోస్ట్ చేయబడిన రాష్ట్ర సాయుధ పోలీసు దళ సభ్యులు, భారతదేశం వెలుపల పోస్ట్ చేయబడిన కేంద్ర ప్రభుత్వ క్రింద ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు,. గైర్హాజరీ ఓటర్లతో సహా నోటిఫైడ్ ఓటర్లు – 80 ఏళ్లు పైబడిన ఓటర్లు (AVSC), 40 శాతం పైబడి ఉన్న దివ్యంగులు PWD (AVPD)గా గుర్తించబడిన ఎలెక్టర్లు, COVID-19 (AVCO) సోకిన ఓటర్లు, అవసరమైన సేవల్లో (AVES) లేదా ఏదైనా ఇతర కేటగిరీలో పనిచేస్తున్న ఓటర్లు కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా నోటిఫై చేయబడిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలో వివరించడం జరిగింది. ఈ సమావేశంలో నియోజక వర్గ ఎన్నికల అధికారులు రాజానగరం – ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, అనపర్తి – స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (గెయిల్ (ఐ) లిమిటెడ్) ఏబీవీఎస్బి శ్రీనివాస్, కొవ్వూరు – ఆర్డీవో కృష్ణ నాయక్, నిడదవోలు – స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పి ఐ పి ఆర్ ఎమ్ సి యూనిట్-I, కొవ్వూరు ఎమ్ . ఝాన్సీ రాణి, రాజమండ్రి (రూరల్) ఎస్.డి.సి., ఎస్. సరళా వందనం, గోపాలపురం – ఓఎన్జీసి ఎస్.డి.సి., ఎమ్. వెంకట సుధాకర్, జిల్లా, నియోజక వర్గ మాస్టర్ ట్రైనర్లు, కలెక్టరేట్ ఎన్నికల సిబ్బంది తదితరులు హాజరయ్యారు.