Breaking News

రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలో తాత్కాలిక స్ట్రాంగ్ రూం కోసం పరిధిలో న్యాక్ అదనపు భవనం పరిశీలన

– కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి నియోజక వర్గ పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి పంపిణీ, ఈ వి ఎం లు, అనుబంధ యూనిట్స్ భద్రపరిచేందుకు ముందస్తు ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ , రూరల్ తహశీల్దార్ పి. చిన్నారావు తో కలిసి కలెక్టరేట్ ఆవరణలో ఉన్న న్యాక్ అనుబంధ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత అధికారులకి సూచనలు చేస్తూ ప్రతి నియోజక వర్గ పరిధిలో పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎన్నికల సామగ్రి తో పాటు బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాట్ లని భద్రపరచి పోలింగ్ తేదీకి ముందు రోజు ఆయా సామగ్రిని ఎన్నికల సిబ్బందికి అందచెయ్యల్సి ఉంటుందని అన్నారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేసిన తరువాత, జిల్లాకు చెందిన అన్ని నియోజక వర్గాల బ్యాలేట్ బాక్సులు , ఇతర ఓటింగ్ సామగ్రిని జిల్లా స్థాయి లో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూం కి తరలించడం జరుగుతుందని అన్నారు. ప్రతి నియోజక వర్గంలో ఒక తాత్కాలిక స్ట్రాంగ్ రూం తో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేసే క్రమంలో అనువైన భవనాలను గుర్తించి, ఎన్నికల కమిషన్ కు నివేదిక అందజేస్తున్నట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో తాత్కాలిక స్ట్రాంగ్ గుర్తించే ప్రక్రియను సంబంధిత నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు గుర్తించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *