-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 19, 2024 నా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతివనం శనివారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ మాట్లాడుతూ జనవరి 19, 2024న ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం విజయవాడ నగరంలో ఒక మైలురాయిగా మారబోతోందని, ఇప్పటికే విజయవాడ నగర ప్రజలకు ఆకర్షణగా మారిందని. దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం నిర్మాణమైందని. స్మృతి వనం అందాలు స్మృతి వనం చుట్టూ ఉన్న పచ్చదనం ఫౌంటైన్స్ తో మొదలవుతుందని. విజయవాడకు మణిహారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనమని. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 19, 2024న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని అధికారులు అందరూ నిమగ్నులై ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు.