Breaking News

అంగరంగ వైభవంగా ముగిసిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ నగరపాలక సంస్థ ఆధ్వ‌ర్యంలో విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర కార్య‌క్ర‌మాన్ని శ‌నివారం జింఖానా గ్రౌండ్స్ గాంధీనగర్ లో నిర్వహించారు. న‌వ‌భార‌త నిర్మాణంలో అమృత‌కాలం విశిష్ట‌త‌, విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర ఔన్న‌త్యంపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ వ‌ర్చువ‌ల్‌గా అందించిన‌ సందేశాన్ని ప్ర‌జ‌లు తిల‌కించారు. ప‌దేళ్ల‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ నేతృత్వంలో కేంద్ర ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాల‌ను తెలిపే వీడియోను ప్ర‌ద‌ర్శించారు. మేరీ క‌హానీ మేరీ జుబానీలో భాగంగా వివిధ ప‌థ‌కాల ల‌బ్ధిదారులు ప‌థ‌కాల ప్ర‌యోజ‌నంపై త‌మ మ‌నోగ‌తాన్ని ఆవిష్క‌రించారు, పబ్లిక్ టాయిలెట్స్ వాడకం మీద ప్రజలకు అవగాహన కల్పించారు . ఇన్ఫ‌ర్మేష‌న్‌, ఎడ్యుకేష‌న్‌, క‌మ్యూనికేష‌న్ (ఐఈసీ) వాహ‌నo ద్వారా ఆయుష్మాన్ భార‌త్‌, ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ఆరోగ్య యోజ‌న‌, పోషణ్ అభియాన్‌, ఉజ్వ‌ల 2.0, పీఎం ఆవాస్ యోజ‌న త‌దిత‌ర స్టాళ్ల‌ ద్వారా సంక్షేమ పధకాల గురించి అవగాహన కల్పించారు. ప్రజలు ఆరోగ్యం ఉండలానే ఉద్దేశంతో కార్యక్రమం లో భాగంగా హెల్త్ కార్డు లను పంచారు. దేశ‌వ్యాప్తంగా న‌వంబ‌ర్ 15 నుంచి విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర జరుగుతుంది. ప్ర‌తి పేద‌వాని అభివృద్ధికీ అన్ని సదుపాయాలూ అందించాల‌నే ఉద్దేశంతో వివిధ విధానాలు, ప‌థ‌కాల‌ను ప్ర‌భుత్వం ప్రారంభించింది.. అందరికి సంక్షేమం ప‌థ‌కాలు చేరాల‌నే ఉద్దేశంతో విక‌సిత్ భార‌త్ సంకల్ప యాత్ర ద్వారా మోదీ గ్యారెంటీ వ్యాన్ గ్రామ‌గ్రామానికీ వెళ్ళింది . అర్హులెవ‌రైనా ఉంటే వారిని వెంట‌నే న‌మోదు చేయించుకొని, ప‌థ‌కం అందేలా చేస్తున్న‌ట్లు వివ‌రించారు. ఆయుష్మాన్ భార‌త్, పీఎం గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న‌, పీఎం ఆవాస్ యోజ‌న‌, పీఎం కిసాన్ త‌దిత‌ర 17 ప‌థ‌కాల‌కు సంబంధించి ఊరూరా అవ‌గాహ‌న కల్పించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ 2 మాల్యాద్రి జోనల్ కమిషనర్ 3, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ రామకోటయ్య, అడ్డూరి శ్రీరామ్ బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, పిట్టల గోవిందా బిజెపి ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు
వాసా పల్లపురాజు బిజెపి సీనియర్ లీడర్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *