విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధమ పౌరురాలు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన 19-01-2024 నుండి ప్రారంభిస్తున్న శుభ సందర్భంలో 46వ డివిజన్ సచివాలయం పరిధిలో ప్రారంభించిన కులగణనలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 19-01-2024 న ప్రారంభించిన కులగణన కార్యక్రమంలో ప్రజలందరూ ప్రతి సచివాలయంలో నిర్వహించు సర్వేలో పాల్గొని విజయవంతం చేయాలనికోరారు. ఈ కార్యక్రమం 19 జనవరి నుండి 28 జనవరి వరకు జరుగుతుందని ప్రతి సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు సర్వే ద్వారా కులగణన చేస్తారని ప్రజలందరూ ఇందులో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …