-మధ్యతరగతి వర్గాల వారికి అందుబాటులో గుండె వైద్యం
-డాక్టర్ జి.శరత్‌బాబు, డాక్టర్ ఎ.రవికుమార్ వెల్లడి
-ఈ నెల 21న విజయాస్ రవి హార్ట్‌కేర్ సెంటర్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుండెజబ్బుల వైద్యంలో అందరికీ ఆధునిక చికిత్సలు అందించాలన్న లక్ష్యంతో ఈ నెల 21నుండి విజయాస్ రవి హార్ట్‌కేర్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు విజయా సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ సీఈవో డాక్టర్ జి.శరత్‌బాబు తెలిపారు. శుక్రవారంనాడు సూర్యారావుపేటలోని తమ హాస్పటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడచిన దశాబ్ధకాలం పైగా విజయా సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ద్వారా ఎంతోమందికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించామని, నేడు ప్రపంచవ్యాప్తంగా గుండెజబ్బుల సమస్య విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుందని, అందుకోసం అన్ని వర్గాల వారికి అందుబాటులోకి అత్యున్నతస్థాయి ప్రమాణాలతో విజయాస్ రవి హార్ట్‌కేర్ సెంటర్‌ను విశిష్ట నిపుణులైన వైద్యులచే ఈ నెల 21న లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గత 12సంవత్సరాల నుండి హుద్రోగ వైద్యంలో ఎన్నో ఆధునిక చికిత్సలు అందిస్తున్న సీనియర్ ఇంటర్‌వెన్ష్‌నల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎ.రవికుమార్ మాట్లాడుతూ, ప్రపంచస్థాయి ప్రమాణాలతో అన్ని వర్గాల వారికి కరోనరి యాంజియోగ్రామ్ (గుండె రక్తనాళ పరీక్ష), కరోనరీ యాంజియో ప్లాస్టి(సెంట్స్ అమర్చడం), పేస్ మేకర్ అమర్చడం, గుండె రంద్రాలకు ఆధునిక డివైజ్ క్లోజర్ చికిత్స, బైపాస్ సర్జరీలు, వాల్వ్ రీప్లెస్‌మెంట్ సర్జరీలు, బెలూన్ వాల్వోటమి చికిత్స తదితర ఆధునిక చికిత్సలను ఇక్కడ అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. తనతో పాటు బైపాస్ సర్జరీలు చేయడంలో అత్యంత ప్రావీణ్యం గల కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రశాంత్ ప్రభు నేతృత్వం వహిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన జపాన్‌కు చెందిన షిమాడ్జు కేతలాబ్‌ను, అధునాతనమైన ఆపరేషన్ థియేటర్, కార్డియాక్ ఐసీయూ మరియు పేషెంట్లకు అనుగుణంగా డీలక్స్ రూములు వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, సీజీహెచ్ఎస్ మరియు అన్ని రకాల కంపెనీల రీయంబర్స్‌మెంట్ సదుపాయం కలదని తెలిపారు. గుండెపోటు లక్షణాలు గురించి వివరిస్తూ చాతీలో నొప్పి, మంట, ఆయాసం, గుండె దడ, చెయ్యి ఒకవైపు లాగడం, శ్వాస తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు గుండెపోటుకు దారితీస్తాయన్నారు. మొదటి గంటలో గుండెపోటు సంభవించినప్పుడు వైద్యులను సంప్రదిస్తే 95శాతం పేషెంట్ రికవరీ అయ్యే చాన్స్ ఉందన్నారు. చాలామంది గ్యాస్ నొప్పి అని నిర్లక్ష్యం చేస్తున్నారని అది తగదని సూచించారు. ఇటువంటి సమయాన్ని గోల్డెన్ అవర్‌గా పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో హాస్పటల్ ఛైర్మన్ జి.వెంకట్రావ్, డాక్టర్ జి.శరత్‌బాబు, ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ జి.ప్రశాంతి, డాక్టర్ ప్రశాంత్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండెజబ్బులపై అవగాహన కల్పించే కరపత్రాన్ని ఆవిష్కరించారు.