Breaking News

సంద‌ర్శ‌కుల‌కు మ‌ధురానుభూతి మిగిల్చేలా ఏర్పాట్లు

-జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ న‌డిబొడ్డున స్వ‌రాజ్ మైదాన్‌లో దేశానికే త‌ల‌మానికంగా గౌర‌వ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు ఈ నెల 19న ఆవిష్క‌రించిన బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హం, స్మృతివ‌నం సంద‌ర్శ‌న‌కు వ‌స్తున్న వారికి ఎక్క‌డా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు.
క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు మంగ‌ళ‌వారం డా. బీఆర్ అంబేద్క‌ర్ సామాజిక న్యాయ మ‌హాశిల్పం ప్రాంగ‌ణాన్ని సంద‌ర్శించారు. మ్యూజిక‌ల్ ఫౌంటెన్‌, ఉద్యాన‌వ‌నం, అంబేద్క‌ర్ చైత్య మ్యూజియం త‌దిత‌రాల వ‌ద్ద ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ భార‌తర‌త్న డా. బాబా సాహెబ్ అంబేద్క‌ర్ కాంస్య విగ్ర‌హాన్ని, స్మృతివ‌నాన్ని సంద‌ర్శించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇత‌ర రాష్ట్రాల నుంచి సంద‌ర్శ‌కులు వ‌స్తున్నార‌ని తెలిపారు. సంద‌ర్శ‌కుల‌కు ప‌ర్య‌ట‌న మ‌ధురానుభూతులు మిగిల్చేలా మ‌దిలో క‌ల‌కాలం నిలిచిపోయేలా చేసేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసింద‌ని.. అధికారులు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రిస్తూ ప‌టిష్ట ప‌ర్య‌వేక్ష‌ణ‌తో సంద‌ర్శ‌కుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల‌ని ఆదేశించిన‌ట్లు వెల్ల‌డించారు. తాగునీరు, మ‌రుగుదొడ్లు త‌దిత‌రాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించిన‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు తెలిపారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *