-అమెరికా, కెనాడాలో హిందీ అధ్యయనం, వ్యాప్తికి కృషి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. హిందీ భాషాభివృద్ది కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న విశ్వ హిందీ పరిషత్, అచార్య యార్లగడ్డను అమెరికా, కెనాడా దేశాలకు హిందీ భాషా సమన్వయకర్తగా నియమించింది. అక్కడి ఔత్సాహికులకు యార్లగడ్డ హిందీ నేర్చుకోవటంలో ప్రత్యేక తర్ఫీదును ఇస్తారు. నెలరోజుల తరువాత కెనడా చేరుకుని అక్కడ కూడా హిందీ అధ్యయనానికి అవసరమైన చర్యలను పర్యవేక్షిస్తారు. ఈ నేపథ్యంలో విశ్వ హిందీ పరిషత్తు నేతృత్వంలో సంయోజకుడు విపన్ కుమార్ మంగళవారం అచార్య యార్లగడ్డకు డిల్లీలో స్వాగతం పలికి మెమొంటో, శాలువాతో సత్కరించారు. ఈ క్రమంలో యార్లగడ్డ మంగళవారం అమెరికా బయలు దేరి వెళ్లారు.