కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ముందుకు దూసుకెళ్తున్నారు. దీనిలో భాగంగా గోపాలపురం నియోజకవర్గంలో ఈ నెల 25వ తేదీన గురువారం నూతన క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం, నియోజవర్గ నాయకుల పరిచయ వేదిక, విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం 9:00 గంటలకు దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామం చేరుకుని, 9:30 గంటలకు యర్నగూడెంలో నూతన క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు క్యాంపు ఆఫీస్ నుండి ద్వారకా తిరుమల వరకు ర్యాలీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ద్వారకా తిరుమల కాపు కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న లేఅవుట్ వద్ద వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలో హోంమంత్రి తానేటి వనిత అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి పరిచయ కార్యక్రమంతో పాటు విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి గోపాలపురం నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధులు,
నాయకులు, కార్యకర్తలు, అభిమానుల వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. జగనన్న ప్రభుత్వాన్ని, గోపాలపురం నుంచి తనను వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆశీర్వదించాలని హోంమంత్రి తానేటి వనిత కోరారు.
Tags kovvuru
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …