Breaking News

ముఖ్యమంత్రి పర్యటనపై ముందస్తు భద్రత ఏర్పాట్లపై ఎస్పీ తో కలిసి సమీక్షించిన కలెక్టర్

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 24 న బుధవారం తిరుపతి పర్యటన సందర్భంగా చిన్నపాటి లోపలకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి పేర్కొన్నారు.

ఎస్పీ పరమేశ్వర రెడ్డి,జాయింట్ కలెక్టర్ శుభం భవల్స్ లతో కలసి మంగళవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం నందు ఈ నెల 24 న రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి పర్యటన కు సంబంధించి ASL లో( ముందస్తు భద్రత లైజన్) పై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 24 న బుధవారం తిరుపతి తాజ్ హోటల్ నందు నిర్వహించే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొననున్నారని అందులో భాగంగా ఎలాంటి చిన్నపాటి లోపలకు తావివ్వరాదన్నారు. ఆ. ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తాజా హోటల్ ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించి అనంతరం రేణిగుంట విమానాశ్రయం చేరుకొని ముఖ్యమంత్రి 24 న బుధవారం సా.4.05 గం. రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గాన 4.30 గంటలకు తాజ్ హోటల్ చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్
కార్య క్రమంలో పాల్గొంటారని తెలిపారు
కార్యక్రమం అనంతరం ముఖ్య మంత్రి తాజ్ హోటల్ నుండి బయలుదేరి 5.30 గంటలకు రేణిగుంట రేణిగుంట విమానాశ్రయం చేరుకొని తిరుగు ప్రయాణం కానున్నారని భద్రతా ఏర్పాట్లు పగడ్భందీగా వుండాలని సూచించారు. వైద్య శాఖ స్పెషలిస్ట్ డాక్టర్ల ఏర్పాటు, అంబులన్స్, సేఫ్ రూమ్, అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ అధికారులు ఫైర్ సేఫ్టీ చర్యలు, ఫుడ్ సేఫ్టీ తదితర శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో ఎస్పి మాట్లాడుతూ బందోబస్తు పటిష్టంగా ఉండాలని విధులు కేటాయించిన పోలిస్ అధికారులకు భద్రతపై తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీవోలు నిశాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, , ఏర్పోర్ట్ సి ఎస్ ఓ రాజశేఖర్ రెడ్డి, ఎ ఎస్పీ విమల కుమారి, జిల్లా ఆర్ అండ్ బి అధికారి సుధాకర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల రాజా రఘు వీర్ , పౌర సరఫరాల శాఖ మేనేజర్ సుమతి , జిల్లా ఫైర్ ఆఫీసర్ రమణయ్య , ఇన్స్పెక్టర్ రెడ్డప్ప రెడ్డి సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *