విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్ఎస్ఎసి) ఆధ్వర్యంలో బిఎస్సి నర్సింగ్ చదువుకున్నటువంటి వారికి జర్మనీ లో నర్స్ అసిస్టెంట్ గా అవకాశం కల్పిస్తున్నట్లు యన్.టి.ర్ జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ ఎస్.ఢిల్లీరావు తెలిపారు. ఇందుకొరకు అభ్యర్ధులు 20-35 వయస్సు కలిగి కనీసం సాధారణ ఆసుపత్రులలో అనుభవం కలిగి జర్మన్ భాష నేర్చుకొనుటకు ఆసక్తి కలిగి ఉండాలి అని పేర్కొన్నారు.
అర్హత ప్రమాణం:-
అభ్యర్థి జర్మనీలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి.
అభ్యర్థి తప్పనిసరిగా నర్సింగ్ గ్రాడ్యుయేట్ (B.Sc నర్సింగ్) అయి ఉండాలి.
కనీసం పని అనుభవం ఉండాలి.
అభ్యర్థి వయస్సు 20 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
విజయవాడలోని ఎ.పి.యస్.యస్.డీ.సి – స్కిల్ కాలేజీ, దర్గా ప్లాట్స్, ఒప్పొసితె గౌతమ్ కార్గో, నియర్ వెంకటేశ్వర ఫౌండ్రి, భవానీపురం, విజయవాడ లో నిర్వహించబడే B1 స్థాయి వరకు జర్మన్ భాషా శిక్షణ కోసం నిర్బంధ ఉచిత ఆన్లైన్ తరగతులకు హాజరు కావాలి.
B1 స్థాయి ఉత్తీర్ణత సాధించిన తర్వాత, జర్మనీలో పని చేయడానికి ఆఫర్ లెటర్ ఇవ్వబడుతుంది.
అవసరమైన పత్రాలు:-
రెజ్యూమ్ & ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్, అనుభవ ధృవీకరణ పత్రం తప్పనిసరి.
జర్మనీలో సౌకర్యాలు:-
విమాన ఛార్జీలు ఉచితం.
ఆహారం & వసతి ఉచితం మరియు జీతం నెలకు రూ.1,70,000/-.
తర్వాత 6 నెలల పాటు జర్మనీలో బి2 సర్టిఫికేషన్ కోసం శిక్షణ ఇస్తారు. B2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పుడు జీతం నెలకు దాదాపుగా నెలకు రూ.3,10,000/- ఉంటుంది.
శిక్షణ తరగతుల సమయం షెడ్యూల్:-
తరగతులు ఎ.పి.యస్.యస్.డీ.సి – స్కిల్ కాలేజీ, దర్గా ప్లాట్స్, ఒప్పొసితె గౌతమ్ కార్గో, నియర్ వెంకటేశ్వర ఫౌండ్రి, భవానీపురం, విజయవాడ. 30th జనవరి 2024 న ప్రారంభమవుతాయి.
విద్యార్ధులు హాస్టల్ లలో ఉండాలి మరియు ఉచితం.
రిజిస్ట్రేషన్ నమోదు లింక్:-
www.apssdc.in/home/onlineProgram Registration
ఆసక్తిగల అభ్యర్థులు దయచేసి మీ సర్టిఫికేట్ రెజ్యూమ్ని helpline@apssdc.in మెయిల్ ఐడి లేదా కాల్ సెంటర్: 99888 53335 మరియు 9885047939, 9494639385 ఈ నంబర్లను సంప్రదించగలరు.