విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ వారిని పార్టీకి మరింత చేరువ చేయడమే లక్ష్యంగా గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ” కార్యక్రమం ద్వారా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ కుటుంబ సభ్యలు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్, కరణం బజార్, కిలారు వారి స్ట్రీట్, యాదవులు బజార్ ప్రాంతాల్లో దేవినేని క్రాంతి, 19వ డివిజన్ శ్రీరామ్ నగర్ రోడ్,RCM చర్చ్ రోడ్ ప్రాంతాలలో వై.సిద్దార్థ గడప గడపకి వెళ్లి ఈ నాలుగున్నర ఏళ్లలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది.
దేవినేని క్రాంతి మాట్లాడుతూ సీఎం జగన్ పేదల పక్షపాతి అని అన్నారు. అభివృద్ది,సంక్షేమానికి పెద్ద పీఠ వేసిన సీఎం జగన్ ఆన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందారుఅన్నారు..పథకాలను ఇంటి వద్దకే అందిస్తున్న ఘనత జగన్ సొంతమని ఆమె తెలిపారు..
వై.సిద్దార్థ మాట్లాడుతూ నవరత్నాలు పక్కగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళుతున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్ అని, సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న దేవినేని అవినాష్ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడం తద్యమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని పవన్,19వ డివిజన్ కార్పొరేటర్ రహేనా నాహీద్, కో అప్షన్ సభ్యులు సయ్యద్ అలీమ్, మరియు డివిజన్ ప్రెసిడెంట్లు,మండల ఇంఛార్జీలు,క్లస్టర్ ఇంఛార్జీలు, వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.