-వేమమగిరి తోటలో స్వచ్ఛత మనందరి బాధ్యత కార్యక్రమం పాల్గొన్న మంత్రి వేణు
-ఇంటింటికి వెళ్లి పలు ప్రజా సమస్యలు తెలుసుకున్న మంత్రి..
-వాటిని పరిష్కరించి దిశగా అధికారులకు ఆదేశాలు జారీ.
-రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛత కూడిన పరిసరాలు పరిశుభ్రతకు పెద్దపేట వేస్తోంది
-గ్రామాల్లో కాలుష్య నివారణ అరికట్టే విధంగా చెత్తను తొలగిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం .
-ఆరోగ్యవంతమైన సమాజ సంకల్పానికి నాంది పలుకుదాం
-దేశ సంరక్షణకు సైనికులు కృషి చేస్తే.. ఆరోగ్యవంతమైన సమాజం కొరకు పారిశుద్ధ్య కార్మికులు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు.
-పరిశుభ్రతే మన జీవన పురోగతి
-పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచటం మంనందరీ సామాజిక బాధ్యత
-మురుగునీటి గుంటలను పరిశుభ్రం చేయాలని అధికారులకు ఆదేశం
కడియం, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ రక్షణ కొరకు సైనికులు ఏ విధంగా పనిచేస్తారో.. పారిశుధ్య నిర్వహణ లో అదే బాధ్యత కలిగిన పారిశుధ్య కార్మికులు గ్రామాల్లోని చెత్తను క్లీన్ చేసి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తారని మంత్రి సిహెచ్ . శ్రీనివాస్ వేణు గోపాల కృష్ణ పేర్కొన్నారు. శనివారం గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా మంత్రి వేణుగోపాలకృష్ణ కడియం మండలం వేమగిరి తోటలో పర్యటించి పలు ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని అక్కడక్కడే పరిష్కరించే దిశగా అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ నేను పాలకుడిని కాదని మీకు సేవ చేసేందుకే రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ గా సీఎం బాధ్యతలు అప్పగించారని మీకు సేవకునిగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని అన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన మాట.. విసర్జిత పదార్థాలు గాలిలో కలుషితమై ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ఆటంకంగా ఏర్పడతాయని పేర్కొన్నారని మంత్రి చెప్పారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, ఆ దిశగా నావంతు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమం ద్వారా అన్ని వార్డుల్లో పర్యటిస్తూ చెత్తను తొలగిస్తూ పరిశుభ్రత దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇప్పటికే ధవలేశ్వరం లో అపరిశుభ్రతగా ఉన్న డ్రైన్లు, పరిసరాలలో పరిసరాలను క్లీన్ చేసే కార్యక్రమాన్ని ద్వారా చైతన్యం ప్రజల్లో తీసుకుని రావడానికి గత మూడు రోజులుగా చేపట్టడం జరిగిందన్నారు. దేశ సైనికులు దేశ రక్షణలో ఏవిధంగా విధుల్లో ఉంటారో, సమాజ పరిరక్షణ, పారిశుధ్యం కోసం అదే విధంగా పారిశుధ్య కార్మికులు పనిచేస్తూన్నట్లు తెలిపారు.
మంత్రి గ్రామంలో పర్యటిస్తున్న సందర్భంలో రోడ్డు కిరువైపులా పేర్కొన్న చెత్తను వెంటనే తొలగించి, శుభ్రపరిచే విధానాన్ని ముందు.. తరువాత ఫోటోలను పంపించాలనే అధికారులు ఆదేశించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రాంతాన్ని స్వచ్ఛతగా రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ వేణు మంత్రి ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న తరుణంలో వేమగిరి గ్రామంలో తీవ్ర నడుం నొప్పి నరాల బలహీనత మోకాళ్లు నొప్పితో నడవలేని స్థితి లో తీవ్ర అనారోగ్యానికి గురైన టేకుమూడి రమణ ఆరోగ్య పరిస్థితులు దృష్ట్యా వెంటనే మంత్రి వేణుగోపాలకృష్ణ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ప్రియాంకకు ఫోన్ చేసి ఆరోగ్యశ్రీ ద్వారా తక్షణ వైద్యాన్ని అందించాలని ఆదేశించారు.
మంత్రి వేణు గోపాలకృష్ణ.. దివ్యాంగుడైన గుత్తుల సత్యనారాయణ పరామర్శించి.. మీ ఆరోగ్యం ఎలా ఉంది.. ప్రభుత్వం గురించి పెన్షన్ పొందుతున్నారా.. ఏఎన్ఎంలు తరచూ మీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని సమయానికి మందులు అందిస్తున్నారా..అని పరామర్శించగా.. సత్యనారాయణ వివరిస్తూ దివ్యాంగుల కోటాలో ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్ వస్తుందని, గ్రామంలోని తన ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ సమయానికి క్రమం తప్పకుండా మందులు కూడా అందిస్తున్నారని మంత్రికి వివరించారు.
గుడ్ మార్నిగ్ కార్యక్రమంలో మంత్రి వేణు వెంట ఎంపీ డిఓ కే. రత్న కుమారి, ఈఒపిఆర్డి వై ఎన్ ఎస్ లక్ష్మి,
వేమగిరి సొసైటీ చెర్మన్ వెలుగుబండి అచ్చుతారాం, జెగురపాడు సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్థాలిన్, వై ఎస్ ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి గిరిజల బాబు, స్థానిక నాయకులు గుబ్బల నాగార్జున, కట్ట జమిందార్,ఎన్. గణపతి, ఎన్. మోహన్, బడుగు ప్రశాంత్ కుమార్, విప్పార్తి పణికుమార్, కాగిత రాజు తదితరులు పాల్గొన్నారు.