విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధి కల్పన శాఖ మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ఐటిఐ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులకు పలు రకాల ఉద్యోగాల నియామకానికి ఈ నెల 31వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి దేవరపల్లి విక్టర్ బాబు మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాస్ రావు సంయుక్తంగా తెలిపారు. ఈ జాబ్ మేళా ఉదయం 10 గంటల నుండి ప్రారంభం అవుతుంది అని అన్నారు. 18 ఏళ్ల నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగి 10 వ తరగతి అపై చదివిన విభిన్న ప్రతిభావంతులు పాల్గొనవచ్చు అని స్పష్టం చేశారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి 1.2లక్షల నుంచి 3 లక్షల వరకు వేతనం లభిస్తుంది అని అన్నారు. ఈ జాబ్ మేళా కు హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యార్హత ధృవ పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో నేరుగా ఇంటర్వూలకు హజరు కావాలని సూచించారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …