-శాంతిపురంలో రు. 24 లక్షలతో డ్రైనేజీ, రహదారి నిర్మాణం, రు.2.20 కోట్లతో ఐ ఎన్ టి డి నుంచి బొమ్మూరు వరకు రహదారి పనులు ప్రారంభించుకున్నాం
-మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ మురుగునీటిపారుదల, మెరుగైన పారిశుద్ధ్యం వంటి పనులను చేపట్టి చేస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి, మరియు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు.
శుక్రవారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం హుకుంపేట పరిధిలో గల శాంతిపురం రెండవ వీధిలోను, ఐఎల్ టి డి జంక్షన్ నుండి బొమ్మూరు వరకు వేయినున్న రహదారి పనులకు మంత్రి వేణుగోపాలకృష్ణ అధికారులు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసిందన్నారు.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా చేసే దిశగా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
ఇందులో భాగంగానే నేడు హుకుంపేట పంచాయతీ పరిధిలో గల శాంతిపురంలో రు.24 లక్షలతో డ్రైనేజీ, రహదారి అభివృద్ధి పనులు, రోడ్లు భవనాల శాఖ ద్వారా రు. 2 కోట్ల 20 లక్షలతో ఐఎల్ టి డి నుంచి బొమ్మూరు వరకు రాజవోలు నుండి కేశవరం వరకు వేయినున్న రహదారి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించుకున్నామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వెంట రాజమండ్రి రూరల్ ఎంపీడీవో శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి డి ఈ బివి మధుసూదనరావు,
నగరపాలకసంస్థ రూరల్ డివిజన్‌ల పార్టీక్లస్టర్ అధ్యక్షుడు మింది నాగేంద్ర, జేసీఎస్‌ల ఇన్‌చార్జిలు కొప్పినీడిప్రసాద్‌బాబు (రాజమౌళి), గుండేటి శ్రీనివాసరెడ్డి స్థానిక నాయకులు ఎన్. సుబ్బారావు, పి రాజు, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు.