Breaking News

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నాం

-శాంతిపురంలో రు. 24 లక్షలతో డ్రైనేజీ, అంతర్గత రహదారి.
-రు.2.20 కోట్లతో ఐ ఎల్ టి డి నుంచి బొమ్మూరు వరకు రాజోలు నుండి కేశవరం వరకు రహదారి పనులు
-నేడు శంఖుస్థాపన చేసి పనులు ప్రారంభం
-మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ మురుగునీటిపారుదల, మెరుగైన పారిశుద్ధ్యం వంటి పనులను చేపట్టినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి, మరియు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు.

శుక్రవారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం హుకుంపేట పరిధిలో గల శాంతిపురం రెండవ వీధిలోను, ఐఎల్ టి డి జంక్షన్ నుండి బొమ్మూరు వరకు వేయినున్న రహదారి పనులకు మంత్రి వేణుగోపాలకృష్ణ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసిందన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా చేసి పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే నేడు హుకుంపేట పంచాయతీ పరిధిలో గల శాంతిపురం లో రు.24 లక్షలతో డ్రైనేజీ, అంతర్గత రహదారి అభివృద్ధి పనులు, రోడ్లు భవనాల శాఖ ద్వారా రు. 2 కోట్ల 20 లక్షలతో ఐఎల్ టి డి నుంచి బొమ్మూరు వరకు రాజవోలు నుండి కేశవరం వరకు వేయినున్న రెండు రహదారి పనులకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వెంట రాజమండ్రి రూరల్ ఎంపీడీవో శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి డి ఈ బివి మధుసూదనరావు,
నగరపాలకసంస్థ రూరల్‌ డివిజన్‌ల పార్టీక్లస్టర్‌ అధ్యక్షుడు మింది నాగేంద్ర, జేసీఎస్‌ల ఇన్‌చార్జిలు కొప్పినీడి ప్రసాద్‌బాబు (రాజమౌళి), గుండేటి శ్రీనివాసరెడ్డి స్థానిక నాయకులు ఎన్. సుబ్బారావు, పి రాజు, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *