Breaking News

జిల్లా స్థాయి 10 వ పారిశ్రామిక అభివృద్ధి కమిటీ సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పారిశ్రామిక పరంగా వివిధ రాయితిల ధరఖాస్తులను పరిశీలించి పరిశ్రమలకు సుమారు 29 లక్షల 88 వేల రుపాయాలు రాయితీ ని మంజూరు చేసిన్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.

శనివారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు 10వ జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటి సమావేశం జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి కోసం ముందుకు రావాలని కోరారు. సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేసి, ప్రోత్సాహకం ఇవ్వడం జరుగు తున్నట్లు తెలిపారు. 9 వ సమావేశం సందర్భంలో తీసుకున్న నిర్ణయాలు పురోగతి పై శాఖల వారిగా సమీక్ష నిర్వహించా మన్నారు.

ఈసమపాశానికి వివిధ శాఖల నుండి జిల్లా అధికారులు మరియు వివిధ పారిశ్రామిక సంస్థల సభ్యులు తదితరులు హాజరైనారు. జిల్లా పరిశ్రమల అధికారి బి. వెంకటేశ్వరరావు జిల్లా యంత్రాంగం చర్యలను కమిటి సభ్యులకు వివరించాను. మొదటి 9 వ సమావేశపు అంశాలపై తీసుకున్న చర్యలను , ప్రగతిని సమీక్షించారు. ఈ సంవత్సరంలో (2023-2004) ఇప్పటి వరం 6748కి సుక్మ- చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు (ISMES) రూ.1109 కోట్ల పెట్టు బడితో 25,222 మందికి ఉపాధి కల్పించా మన్నారు. మన జిల్లాలో రూ .3760 కోట్లు పెట్టు బడి లో 5910 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంలో ఏర్పాటు చేయబోయే భారి పరీశ్రమల ‎పై సమీక్షించారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ (GIS) లో చేసుకున్నా బారి పరిశ్రమల ఏర్పాటు ఒప్పందం ప్రగతని సమీక్షించారు. గత సమావేశం ఒప్పందము నుండి నేటి వరకు పరిశ్రమల ఏర్పాటుకు అవసరం అయిన అనుమతులకోసం ధరఖస్తు చేసుకున్న 116 అనుమతుల ప్రగతిని సమీక్షించారు.

ఈ ఆర్థిక సం.ములో 2023-2024 ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం లో 378 యూనిట్లు నెలకొల్పడం జరిగిందనీ అధికారులు వివరించారు.
ఈ సమావేశంలో వివిధ రాయితిల ధరఖాస్తులను పరిశీలించి పరిశ్రమలకు సుమారు 29 లక్షల 88 వేల రూపాయాలు రాయితీ ని మంజూరు చేసియున్నారు.

ఈ సమావేశానికి జిల్లా పరిశ్రమల అధికారి బి. వేంకటేశ్వర రావు, జోనల్ మేనేజర్ ఏపీ ఐఐసీ, డి వి ఎం ఎస్. జోష్ణ, ఏపీపీసీబీ ఈ ఈ, సందీప్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్, కే. కేదారేశ్వర రావు, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, జి స్వాతి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, బి. సుజాత కుమారి, డిడి సోషల్ వెల్ఫేర్, ఎం. సందీప్, ఈ డి ఏ పి ఎఫ్ పి ఎస్, కే స్వాతి, డి డీ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, వై శ్రీనివాస్, ఎస్సీ ఎస్టీ చాంబర్ ఆఫ్ కామర్స్ మెంబెర్, ఎన్.వెంకట్రావు, డిఆర్డిఏ పిడి, ఎన్ వి ఎస్. మూర్తి, ఏపీ సిరమిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఏ జార్జి బాబు, ఎస్సీ ఇండస్ట్రీస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, ఎన్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *